ఆమనగల్లు: రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని జంగారెడ్డిపల్లి పోలింగ్‌బూత్ వద్ద శుక్రవారం ఉదయం కల్వకుర్తి నియోజకవర్గ కాం గ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డిపై బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడిన ఘటనలో ఆయన గాయపడ్డారు. దీంతో ఆయనకు ఆమనగల్లు ప్రభుత్వాస్పత్రిలో ప్రాథమిక చికిత్స నిర్వహించి అనంతరం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. జంగారెడ్డిపల్లిలోని పోలింగ్‌బూత్ వద్దకు వంశీచంద్‌రెడ్డి చేరుకుని క్యూలో ఉన్న ఓటర్లకు అభివాదం చేస్తూ బూత్ లోపలికి వెళ్లారు.
దీనికి బీజేపీ కార్యకర్తలు అభ్యంతరం చెప్పారు. క్యూలో ఉన్న వారికి కాంగ్రెస్‌కు ఓటేయమని వంశీచంద్‌రెడ్డి ప్రచారం చేశారని బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. తాను అభ్యర్థినని పోలింగ్‌బూత్‌లోకి వెళ్లడానికి అనుమతి ఉందని చెప్పడంతో ఒక్కసారిగా బీజేపీ కార్యకర్తలు, అభిమానులు పోలింగ్ బూత్‌లోకి దూసుకువచ్చి ఆయనతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు జోక్యం చేసుకుని వంశీ చంద్‌ను బయటకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో అక్కడే ఉన్న వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి.
జాతీయ రహదారిపై రాస్తారోకో
బీజేపీ కార్యకర్తల దాడిలో వంశీచంద్‌రెడ్డి గాయపడ్డారని తెలియడంతో కాంగ్రెస్, టీడీపీ నాయకులు పెద్ద సంఖ్యలో ఆమనగల్లు ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. ఆయనను నిమ్స్‌కు తరలించిన అనంతరం జాతీయ రహదారిపైకి చేరుకున్న నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించా రు. సీఐ నర్సింహారెడ్డి, ఎస్‌ఐ మల్లీశ్వర్‌లు, పోలీసు సిబ్బంది అక్కడకు చేరుకుని కాం గ్రెస్, టీడీపీనేతలను సముదాయించారు.
నిమ్స్‌లో నేతల పరామర్శ
నిమ్స్‌లో చేరిన వంశ్‌చంద్‌ను కాంగ్రెస్ నేతలు జైపాల్‌రెడ్డి, వీహెచ్, కేవీపీ, కోదండరెడ్డి, టీడీపీ నేత రావుల చంద్రశేఖరరెడ్డి పరామర్శించారు. చికిత్స అనంతరం వంశీచంద్‌రెడ్డి ప్రైవేట్ అంబులెన్స్‌లో ఓటు వేసేందుకు స్వగ్రామానికి వెళ్లారు.
చికిత్స తీసుకుంటున్న వంశీచంద్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment