హైదరాబాద్: రాజకీయ లబ్ధికోసమే బీజేపీ ప్రభుత్వం ఓసీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పి స్తూ బిల్లును తీసుకువచ్చిందని జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య ఆరోపించారు. బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ప్రజాఫ్రంట్ ఆధ్వర్యం లో ఓసీలకు కల్పించిన రిజర్వేషన్ బిల్లును వెం టనే ఉపసంహరించుకోవాలన్న డిమాండ్‌తో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ.. ఓసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు పాస్ చేయడం నిం డు దర్బార్‌లో ద్రౌపదీ వస్త్రాపహరణం జరి గి నట్లు ఉందన్నారు. ఆనాడు కౌరవులు మహాసభలో కళ్లుమూసుకుని దీనికి మద్దతు పలికినట్లుగా ఈనాడు లోక్‌సభలో ఎంపీలు ఈ బిల్లుకు మద్దతు తెలిపారన్నారు.
రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకుంటే తప్ప బడుగులకు న్యాయం జరగదని స్పష్టం చేశారు. ఇలాంటి విధానాల వల్ల రిజర్వేషన్ల ఉనికినే కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. బడుగు, బలహీన వర్గాలవారంతా ఏకమై రాజ్యాధికారం కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. టీపీఎఫ్ అధ్యక్షుడు నలమాస కృష్ణ మాట్లాడుతూ.. అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు తీసుకురావడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీపీఎఫ్ ప్రధాన కార్యదర్శి మెంచు రమేశ్, ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ అన్వర్‌ఖాన్, టీవీవీ అధ్యక్షుడు మద్దిలేటి, సీఎంఎస్ నాయకులు దేవేంద్ర, రవి చంద్ర, తెలంగాణ రైతాంగ సమితి నాయకుడు సాయన్న తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment