ట్వీటర్ వేదికగా పలు వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మత ప్రాతిపదికన రిజర్వేషన్లు వ్యతిరేకించడంతో పాటు రాజ్యాంగ స్ఫూర్తికి కట్టుబడ్డ ఏకైక పార్టీ తమదేనని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు వ్యాఖ్యానించారు. ముస్లిం రిజర్వేషన్ల అంశంపై టీజేఏసీ వేదికపై ఎప్పుడు చర్చిం చారని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్‌లలోని మద్దతుదారుల కోసం టీజేఏసీని హైజాక్ చేసేందుకు కోదండరాం ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. మంగళవారం ట్వీటర్‌లో ఆయా అంశాలపై పలు వ్యాఖ్యలు చేశారు.
ముస్లిం రిజర్వేషన్ల అంశంపై కోదండరాంను టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు. హిందువులు, ముస్లింలుగా సమాజాన్ని విభజించడం బ్రిటిష్ రాచరికానికి తార్కాణమని, దాన్ని కాంగ్రెస్ పెంచి పోషించగా, ఇప్పుడు టీఆర్‌ఎస్ అమలు చేస్తోందన్నారు. కొత్తగా ఈ బృందంలోకి కోదండరాం నేతృత్వంలో టీజేఏసీ వచ్చి చేరిందని ఎద్దేవా చేశారు.