P. Murlidhar Rao
-
టీఆర్ఎస్వి ఓటుబ్యాంకు రాజకీయాలు!
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు సాక్షి,న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాల కంటే మరింత అన్యాయం గా టీఆర్ఎస్ ముందుకు తీసుకెళుతోం దని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు విమర్శించారు. ముస్లింల రిజర్వేషన్ల బిల్లుపై దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిందని, ఇది పూర్తిగా అన్యాయం, చట్ట విరుద్ధమని వ్యాఖ్యానించారు. రాజ్యాంగ భావనను, రాజ్యాంగ నిర్మాతల స్ఫూర్తికి విరుద్ధంగా తీసుకున్న నిర్ణయమన్నారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఈ విధమైన రిజర్వేషన్లను ఇప్పటి వరకు ప్రతిపాదించ లేదన్నారు. తెలంగాణలో ముస్లింల జనాభా తో సమానంగా రిజర్వేషన్లు కల్పించ డమంటే దాదాపుగా 200 శాతం రిజర్వేషన్లు కల్పిం చినట్లేనన్నారు. మత ఆధా రంగా రిజర్వేషన్లతో ఎన్నికల కు పోతే టీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాని పరిస్థితి వస్తుందన్నారు. వెనుకబాటుతనం కేవలం ముస్లింలలోనే లేదన్నారు. ఇతరత్రా వెనకబ డిన కులాలేమిటి, ఇంకా ఏమైనా కలపాల్సిన కులాలున్నాయా అనే విషయాన్ని చర్చించ లేదన్నారు. రిజర్వేషన్ల బిల్లును బీజేపీ మాత్ర మే వ్యతిరేకిస్తోందన్నారు. తెలంగాణలో అమిత్ షా... తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మే 23 నుంచి 3 రోజులు రాష్ట్రంలో పర్యటిస్తారని మురళీధర్ చెప్పారు. మళ్లీ సెప్టెంబర్‌లో కూడా ఇక్కడికి వస్తారన్నారు. -
టీజేఏసీపై మురళీధర్‌రావు విసుర్లు
ట్వీటర్ వేదికగా పలు వ్యాఖ్యలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మత ప్రాతిపదికన రిజర్వేషన్లు వ్యతిరేకించడంతో పాటు రాజ్యాంగ స్ఫూర్తికి కట్టుబడ్డ ఏకైక పార్టీ తమదేనని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు వ్యాఖ్యానించారు. ముస్లిం రిజర్వేషన్ల అంశంపై టీజేఏసీ వేదికపై ఎప్పుడు చర్చిం చారని ప్రశ్నించారు. టీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్‌లలోని మద్దతుదారుల కోసం టీజేఏసీని హైజాక్ చేసేందుకు కోదండరాం ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. మంగళవారం ట్వీటర్లో ఆయా అంశాలపై పలు వ్యాఖ్యలు చేశారు. ముస్లిం రిజర్వేషన్ల అంశంపై కోదండరాంను టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు. హిందువులు, ముస్లింలుగా సమాజాన్ని విభజించడం బ్రిటిష్ రాచరికానికి తార్కాణమని, దాన్ని కాంగ్రెస్ పెంచి పోషించగా, ఇప్పుడు టీఆర్ఎస్ అమలు చేస్తోందన్నారు. కొత్తగా ఈ బృందంలోకి కోదండరాం నేతృత్వంలో టీజేఏసీ వచ్చి చేరిందని ఎద్దేవా చేశారు. -
జాతీయ పండుగలా జాతర
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు తెలంగాణ రాష్ర్టంలోనే వచ్చే జాతర మేడారం భక్తులకు సౌకర్యాలు కల్పించాలి గోవిందరావుపేట, న్యూస్‌లైన్ : నరేంద్రమోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం మేడారం జాతరను జాతీయ పండుగలా గుర్తించి జాతర నిర్వహిస్తుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు అన్నారు. శుక్రవారం ఆయన బీజేపీ నాయకులతో కలిసి మేడారంలోని సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే జాతర తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుందన్నారు. దేశ ప్రజలంతా అవినీతిమయమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు చూస్తున్నారని, తల్లులను కూడా ప్రజల కోరిక తీరాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రెండేళ్లకోసారి జరిగే జాతరను జాతీయ పండుగలా గుర్తించి, జాతర రోజులను సెలవు దినాలుగా ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంనుంచే కాక పక్క రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చే జాతరలో పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించాలన్నారు. లక్నవరం నుంచి మేడారం జంపన్నవాగుకు నీటి విడుదల జరుగుతున్నందున లక్నవరాన్ని దేవాదుల ప్రాజెక్టుకు అనుసంధానం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జాతరలో నీటి వసతి కోసం మేడారం, చుట్టుపక్కల గ్రామాల్లో చెరువులు, కుంటలను రిజర్వాయర్లుగా మార్చేందుకు దేవాదుల నీటిని తరలించాల్సిన అవసరం ఉందన్నారు. జాతర సమయంలో పంట పండించని వ్యవసాయ భూములకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి అజ్మీరా కృష్ణవేణినాయక్, జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, నాయకులు బానోతు దిలీప్‌కుమార్, ఆకారపు మొగిలి, మహేందర్, లక్ష్మణ్‌నాయక్, గుజ్జుల రామకృష్ణారావు, సావిత్రమ్మ, దశరథం, రుద్రారపు సురేష్, సుధాకర్‌రెడ్డి, సతీష్ ఉన్నారు.