టీఆర్‌ఎస్‌వి ఓటుబ్యాంకు రాజకీయాలు!
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు
సాక్షి,న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాల కంటే మరింత అన్యాయం గా టీఆర్‌ఎస్ ముందుకు తీసుకెళుతోం దని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు విమర్శించారు. ముస్లింల రిజర్వేషన్ల బిల్లుపై దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం తెచ్చిందని, ఇది పూర్తిగా అన్యాయం, చట్ట విరుద్ధమని వ్యాఖ్యానించారు. రాజ్యాంగ భావనను, రాజ్యాంగ నిర్మాతల స్ఫూర్తికి విరుద్ధంగా తీసుకున్న నిర్ణయమన్నారు.
దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఈ విధమైన రిజర్వేషన్లను ఇప్పటి వరకు ప్రతిపాదించ లేదన్నారు. తెలంగాణలో ముస్లింల జనాభా తో సమానంగా రిజర్వేషన్లు కల్పించ డమంటే దాదాపుగా 200 శాతం రిజర్వేషన్లు కల్పిం చినట్లేనన్నారు. మత ఆధా రంగా రిజర్వేషన్లతో ఎన్నికల కు పోతే టీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు కూడా రాని పరిస్థితి వస్తుందన్నారు. వెనుకబాటుతనం కేవలం ముస్లింలలోనే లేదన్నారు. ఇతరత్రా వెనకబ డిన కులాలేమిటి, ఇంకా ఏమైనా కలపాల్సిన కులాలున్నాయా అనే విషయాన్ని చర్చించ లేదన్నారు. రిజర్వేషన్ల బిల్లును బీజేపీ మాత్ర మే వ్యతిరేకిస్తోందన్నారు.
తెలంగాణలో అమిత్ షా...
తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మే 23 నుంచి 3 రోజులు రాష్ట్రంలో పర్యటిస్తారని మురళీధర్ చెప్పారు. మళ్లీ సెప్టెంబర్‌లో కూడా ఇక్కడికి వస్తారన్నారు.