
సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పశ్చిమబెంగాల్ బీజేపీ శిబిరంలో జోష్ నెలకొంది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌమిత్ర ఖాన్ బుధవారం బీజేపీలో చేరారు. గతంలో బెంగాల్ ఎమ్మెల్యేగానూ వ్యవహరించిన ఖాన్ ప్రస్తుతం విష్ణుపూర్ నుంచీ లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
బీజేపీ చీఫ్ అమిత్ షాతో భేటీ అనంతరం ఆయన బీజేపీలో చేరారు. ఖాన్ బీజేపీలో అధికారికంగా చేరే కార్యక్రమంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, బెంగాల్ బీజేపీ నేత ముకుల్ రాయ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, ఖాన్ రాక బెంగాల్‌లో పార్టీ పటిష్టతకు ఉపకరిస్తుందని కమలనాధులు ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment