సాక్షి, హైదరాబాద్: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రం లో మోదీ మంత్రం పనిచేస్తుందనే ఆశాభావంతో బీజేపీ నాయకులున్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన కేం ద్ర బడ్జెట్‌లో రైతులు, ఇతర వర్గాల ప్రజలకు చేసిన కేటాయింపులు, గత ఐదేళ్లలో దేశపురోగమనానికి మోదీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు బీజేపీకి అనుకూలంగా ఓట్లు పడేందుకు ఉపకరిస్తాయనే విశ్వాసంతో ఉన్నారు. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు ఐదు శాతం రిజర్వేషన్ల కల్పన అంశం తురుపుముక్కగా పనిచేస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే లోక్ సభ ఎన్నికలు పూర్తిగా భిన్న అంశాలు, జాతీయస్థాయి ఎజెండాకు అనుగుణంగా జరగనున్నందున మంచి ఫలితాలు వస్తాయనే అభిప్రాయంతో ఉన్నా రు. ముఖ్యంగా కొన్ని సీట్లు గెలిచేందుకు అవకాశాలున్నాయని బీజేపీ రాష్ట్రపార్టీ అంచనా వేస్తోంది.
మార్చి 2 వరకు వరుస కార్యక్రమాలు...
ఈ కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ఐటీ విభాగం సమావేశంలో కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ పాల్గొంటారు. పార్టీ సిద్ధాంతకర్త దీన్‌దయాళ్ ఉపాధ్యాయ వర్ధంతిని పురస్కరించుకుని 11న సమర్పణ దివస్ నిర్వహణ, అదేరోజు మహబూబ్‌నగర్, నాగర్ కర్నూలు, చేవెళ్ల పార్లమెంట్ బూత్ కమిటీ అధ్యక్షులు, ఆపై స్థాయి నేతల సమావేశంలో మరో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పాల్గొంటారు.
ఈనెల 12 నుండి మార్చి 2 వరకు ‘నా కుటుంబం– బీజేపీ కుటుంబం’ కార్యక్రమం, 12న రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల ఇళ్లపై బీజేపీ జెండా ఎగురవేస్తారు. ఇందులో భాగంగా బీజేపీ నాయకుల ఇళ్లపైనా, ప్రతి బూత్‌లో కనీసం 25 ఇళ్లపైనా బీజేపీ జెండా ఎగురవేయడం, స్టిక్కర్ అతికించడం. కమల్ జ్యోతి పేరుతో కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారుల ఇళ్లలో జ్యోతి వెలిగించే కార్యక్రమం. మార్చి 2న ప్రతి అసెంబ్లీలో విజయ్ సంకల్ప్ బైక్ ర్యాలీలకు బీజేపీ సిద్ధమవుతోంది.
కేడర్‌లో జోష్ పెంచేందుకు
ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడానికి పూర్వమే రాష్ట్రవ్యాప్తంగా కేడర్ చైతన్యవంతమయ్యేలా విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టడం, జాతీయ పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా చేపట్టడం ద్వారా జోష్‌ను పెంచాలని భావిస్తోంది. మిగతా పార్టీల కంటే ముందుగానే లోక్‌సభ ఎన్నికలకు పూర్తిస్థాయిలో సిద్ధం కావ డం ద్వారా పైచేయి సాధించేందుకు కార్యాచరణను సిద్ధం చేసింది. ఈ కార్యక్రమాల్లో భాగంగా కేంద్రం నుంచి వివిధ పథకాల ద్వారా లబ్దిపొందిన కుటుంబాలను స్వయంగా కలుసుకునే ఏర్పాట్లు, వారి ఇళ్లలో దీపం వెలిగించే కార్యక్రమాలు, బీజేపీ నాయకులు, కార్యకర్తల ఇళ్లపై పార్టీ జెండాలు ఎగురవేయడం తదితర కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment