బీజేపీ ఎమ్మెల్యే రాజు నారాయణ తోడ్సమ్‌కు చేదు అనుభవం ఎదురైంది. రెండో భార్యతో కలిసి ఉంటూ తనను నిర్లక్ష్యం చేస్తున్న కారణంగా రాజు నారాయణ మొదటి భార్యతో తల్లి కూడా రోడ్డుపైనే ఆయనను చితకబాదారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అసలేం జరిగిందంటే..
మహారాష్ట్రలోని ఆర్ని(ఎస్టీ)నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న రాజు నారాయణ తన రెండో భార్య ప్రియాతో కలిసి మంగళవారం 42వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకొన్నారు. అనంతరం ఓ క్రీడా కార్యక్రమాన్ని ప్రారంభించి ఇంటికి తిరిగి వెళ్లేందుకు పయనమయ్యారు. ఈ క్రమంలో నారాయణ తల్లి, ఆయన మొదటి భార్య అర్చన అక్కడికి చేరుకున్నారు. వారిని వాహనాన్ని అడ్డగించి ప్రియాను కిందకి లాగి ఆమెపై దాడి చేశారు. చెంప దెబ్బలు కొడుతూ, తన్నుతూ ఆమెపై పిడిగుద్దులు కురిపించారు. దీంతో ప్రియాను కాపాడేందుకు వాళ్లకు అడ్డుపడిన రాజు నారాయణను కూడా చితకబాదారు. వీరికి అక్కడ ఉన్న స్థానికులు కూడా మద్దతుగా నిలిచారు.