
సాక్షి, హైదరాబాద్ : ఈబీసీలకు రిజర్వేషన్ తీసుకొచ్చేందుకు కృషిచేసిన ప్రధాని నరేంద్రకి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎన్.ఇంద్రసేనారెడ్డి అభినందనలు తెలిపారు. విద్యా, ఉద్యోగాల్లో పోటీపడలేని అగ్రవర్ణ పేద కుటుంబాలు అంధకారంలో మగ్గిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఆదిలాబాద్‌లోని సోన్ గ్రామంలో బ్రాహ్మణులు పెట్టిన పిండాలను సైతం ఆహారంగా తిని బతికిన జీవితాలను నా స్టడీ లో చూసాను’ అని చెప్పారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
రాజ్యాంగం ప్రకారం సమభావం, సమానత్వం మోదీ పాలనలో నిజమవుతోందని ఆనందం వ్యక్తం చేశారు. సబ్ కా సాత్.. సబ్ కా వికాస్.. అనే నినాదం రుజువు చేసి చూపించారని కొనియాడారు. మోడీ పాలనలో ఎస్సీ రిజర్వేషన్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు అమలు, బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా, ఇప్పుడు ఈబీసీ రిజర్వేషన్ ఇలా.. అన్ని వర్గాల కోసం.. మోడీ పనిచేస్తున్నారని వెల్లడించారు. కులం, మతం అనే తేడా లేకుండా పేదలందరికీ న్యాయం చెయ్యాలనే డిమాండ్ మోదీ తీర్చాడని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment