nallu indrasenareddy
-
కేసీఆర్‌కు స్పష్టమైన పాలసీ లేదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి ఏ అంశంలోనూ స్పష్టమైన పాలసీ లేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనా రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. గురువారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ పరిపాలనలో శూన్యత ఏర్పడిందన్నారు. ప్రభుత్వం దగ్గర వ్యవసాయ ప్రణాళిక లేదు.. రైతులకు భరోసా లేదని మండి పడ్డారు. ఆఖరికి మంత్రి వర్గానికి కూడా స్వేచ్ఛలేదని.. మంత్రులు తమ తమ శాఖల్లో స్వతంత్రంగా సమీక్షలు చేసే అవకాశం లేదని ఆరోపించారు. కొత్త చట్టాల పేరుతో హడావుడి చేస్తున్నారు తప్ప వాటి వల్ల ప్రయోజనం ఏం లేదన్నారు. చెక్‌పవర్‌ని పెట్టి గ్రామీణ వ్యవస్థను కుంటుపడేలా చేస్తున్నారు.. సర్పంచులకు అధికారాలే లేవని ఆరోపించారు. రెండేళ్ల క్రితం జరిగిన కలెక్టర్ల సమావేశంలో రెవెన్యూలోకి రిజిస్ట్రేషన్ అని చెప్పారు ప్రస్తుతం అది ఏమైందని నల్లు ఇంద్రసేనా రెడ్డి ప్రశ్నించారు. భూ వివాదాదాలకు శాశ్వత పరిష్కారమని ఆ రోజు అదే చెప్పారు.. మొన్న జరిగిన కలెక్టర్ల సమావేశంలో కొత్త రెవెన్యూ చట్టం అంటూ ఈ రోజు మళ్లీ అదే చెబుతున్నారు.. పాలసీ విషయంలో ప్రభుత్వానికి స్పష్టత ఉందా అని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో విద్యార్థుల అవస్థలకు లేక్కే లేదు.. నిరుద్యోగులకు ప్రభుత్వంపై నమ్మకం లేదని దుయ్యబట్టారు. కేసీఆర్ బాద్యత లేకుండా మాట్లాడుతున్నారని మండి పడ్డారు. -
‘ఆకలితో పిండాలను సైతం తిన్నవారున్నారు’
సాక్షి, హైదరాబాద్ : ఈబీసీలకు రిజర్వేషన్ తీసుకొచ్చేందుకు కృషిచేసిన ప్రధాని నరేంద్రకి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎన్.ఇంద్రసేనారెడ్డి అభినందనలు తెలిపారు. విద్యా, ఉద్యోగాల్లో పోటీపడలేని అగ్రవర్ణ పేద కుటుంబాలు అంధకారంలో మగ్గిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఆదిలాబాద్‌లోని సోన్ గ్రామంలో బ్రాహ్మణులు పెట్టిన పిండాలను సైతం ఆహారంగా తిని బతికిన జీవితాలను నా స్టడీ లో చూసాను’ అని చెప్పారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగం ప్రకారం సమభావం, సమానత్వం మోదీ పాలనలో నిజమవుతోందని ఆనందం వ్యక్తం చేశారు. సబ్ కా సాత్.. సబ్ కా వికాస్.. అనే నినాదం రుజువు చేసి చూపించారని కొనియాడారు. మోడీ పాలనలో ఎస్సీ రిజర్వేషన్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు అమలు, బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా, ఇప్పుడు ఈబీసీ రిజర్వేషన్ ఇలా.. అన్ని వర్గాల కోసం.. మోడీ పనిచేస్తున్నారని వెల్లడించారు. కులం, మతం అనే తేడా లేకుండా పేదలందరికీ న్యాయం చెయ్యాలనే డిమాండ్ మోదీ తీర్చాడని అన్నారు. -
సీఎం వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీని కించపరిచేలా సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఏ మైకంలో ప్రధానిని అవమానించారో సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రానికి పెద్ద మొత్తంలో కేంద్రం నిధులు కేటాయించినా అవి పూర్తిస్థాయిలో ప్రజలకు ఉపయోగపడకుండా చేసి ఇప్పుడు కేంద్రాన్ని విమర్శించడం దారుణమన్నారు. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత ఏ శాఖ విషయంలో ఎంత ఉంటుందో కూడా తెలియని దుస్థితిలో కేసీఆర్ ఉన్నారని విమర్శించారు. వ్యవసాయశాఖ విషయంలో రాష్ట్రానిదే ప్రధాన బాధ్యత అనే విషయం కూడా ఆయనకు తెలియకపోవటం దారుణమన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులకు యుటిలైజేషన్ సర్టిఫికెట్ సమర్పించకపోవటంతో రావాల్సిన నిధులు ఆగిపోయాయన్నారు. అలాగే ఫసల్ బీమా యోజన పథకం ప్రీమియం వాటా చెల్లించకపోవటంతో రైతులకు బీమా అందకుండా పోయిందని విమర్శించారు. -
బీజేపీ నేతలతో విభేధాల్లేవు: ఇంద్రసేనారెడ్డి
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర కోర్‌కమిటీ సభ్యులెవరితోనూ విభేదాల్లేవని, ఎవరికీ వ్యతిరేకంగా తాను మాట్లాడలేదని ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, జాతీయనేత నల్లు ఇంద్రసేనారెడ్డి చెప్పారు. రాష్ట్ర ముఖ్య నాయకులంతా పార్టీ పటిష్ఠానికి, విస్తరణకోసం ఐక్యంగా పనిచేస్తున్నామన్నారు. ప్రభుత్వ నిర్ణయాలపై పోరాడాల్సిన సమయంలో అదే చిత్తశుద్ధితో, క్రమశిక్షణతో పనిచేస్తున్నానని చెప్పారు. -
హైకోర్టు విభజన కేంద్రం చేతిలో లేదు - నల్లు
దేశంలో అవినీతికి తావులేకుండ ప్రధానమంత్రి మోడీ తన పాలన కొనసాగిస్తున్నాడని బీజేపీ జాతీయ నాయకులు నల్లు ఇంద్రసేనారెడ్డి అన్నారు. అధివారం నాడు తుర్కయాంజాల్‌లోని సామ శ్రీనివాస్‌రెడ్డి గార్డెన్స్‌లో జరిగిన హయత్‌నగర్ మండల బీజేపీ మండల పార్టీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిధిగా హాజైరైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైకోర్డు విభజన కేంద్రం చేతిలో లేదని రాష్ట్రాలు, జడ్జీలు తేల్చుకోవాల్సిన విషయమని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల రీడి జన్ పేరుతో వేల కోట్ల రూపాయల మేరకు అవినీతికి పాల్పడుతుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పోరెడ్డి నర్సింహ్మరెడ్డి, సెన్సార్‌బోర్డు సభ్యులు బోసుపల్లి ప్రతాప్,అధ్యక్షులు బొడిగే గోవర్ధన్, సర్పంచ్ సానేం అంజయ్య, ఎంపీటీసీలు మారగోని శ్రీనివాస్‌గౌడ్, బుర్ర మహేష్, నాయకులు బచ్చిగల రమేష్, వడ్డేపల్లి పాపయ్యగౌడ్, అశోక్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
సీఎం ఏకపక్ష నిర్ణయాలు నష్టదాయకం: నల్లు
హైదరాబాద్: అధికారం ఉంది కదా.. అని సీఎం కేసీఆర్ తమకు ఇష్టం వచ్చినట్లు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే రాబోయే తరాలకు అన్యాయం, మోసం చేసినట్లేనని బీజేపీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి ధ్వజమెత్తారు. సచివాలయం, ఛాతీ ఆస్పత్రి, ఇతర కార్యాలయాల తరలింపు అనేది హైదరాబాద్‌లోని భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారుల పరం చేసేందుకేనా? ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి వారి దృష్టిని మళ్లించేందుకా? అని నిలదీశారు. శుక్రవారం బీజేపీ కార్యాలయంలో పార్టీ నాయకుడు చింతా సాంబమూర్తితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీఎం ఏకపక్షనిర్ణయాలను ప్రజల పక్షాన నిలబడి అడ్డుకుంటామని, హైదరాబాద్ సిటీని రక్షించుకుంటామన్నారు.