హైదరాబాద్: అధికారం ఉంది కదా.. అని సీఎం కేసీఆర్ తమకు ఇష్టం వచ్చినట్లు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే రాబోయే తరాలకు అన్యాయం, మోసం చేసినట్లేనని బీజేపీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి ధ్వజమెత్తారు. సచివాలయం, ఛాతీ ఆస్పత్రి, ఇతర కార్యాలయాల తరలింపు అనేది హైదరాబాద్‌లోని భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారుల పరం చేసేందుకేనా? ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి వారి దృష్టిని మళ్లించేందుకా? అని నిలదీశారు. శుక్రవారం బీజేపీ కార్యాలయంలో పార్టీ నాయకుడు చింతా సాంబమూర్తితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీఎం ఏకపక్షనిర్ణయాలను ప్రజల పక్షాన నిలబడి అడ్డుకుంటామని, హైదరాబాద్ సిటీని రక్షించుకుంటామన్నారు.