సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి ఇబ్బందుల్లో పడ్డారు. తాజాగా రాజ్యసభలో సభా హక్కుల నోటీసు జారీ అయింది. ఈ మేరకు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు వేగంగా స్పందించారు. దీనిపై లోక్‌సభ సభ్యుడు రాహుల్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు ప్రివిలేజ్ నోటీసులు పంపించారు. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ పేరును వక్రీకరిస్తూ రాహుల్ ట్వీట్ చేయడంపై ఈ నోటీసు జారీ చేశారు.
ప్రధాని మోదీ, అరుణ్‌జైట్లీ వ్యాఖ్యలతో కూడిన ఓ వీడియోను ట్వీట్ చేసినరాహుల్.. అందులో jaitleyకి బదులు jait lieగా పేర్కోవడంతోపాడు బీజేపీ lies అంటూ ట్వీట్ చేశారు. ప్రధాని చెప్పింది చేయరు.. చేసింది చెప్పరు అనే విషయాన్ని గుర్తుచేసినందుకు ధన్యవాదాలంటై జైట్టీ ఉద్దేశించి పేర్కొన్నారు. దీంతో దుమారం రేగింది. బీజేపీనేత, రాజ్యసభ ఎంపీ భూపిందర్ యాదవ్ రాహుల్ గాంధీపై ఈ నోటీసు ఇచ్చారు. ఇలా చేయడం ఆయనను అగౌరవపరచడమేనంటూ యాదవ్ ఈ నోటీసు ఇచ్చారు. రాహుల్ గాంధీ కావాలనే జైట్లీ ఇంటిపేరును వక్రీకరించారని ఆరోపించారు. ఇది చాలా "అత్యంత అవమానకరమైనది" అని యాదవ్ ఆరోపించారు. ఈ ఆరోపణపై ప్రాథమిక పరిశీలన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నామని వెంకయ్యనాయుడు ప్రకటించారు.
రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యుడైనందు వల్ల ఆయనపై తదుపరి చర్యలు తీసుకోవాలని కోరుతూ సదరు నోటీసును రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు లోక్‌సభ స్పీకర్‌కు పంపారు. కాగా బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అడ్వాణీ నేతృత్వంలోని ఎథిక్స్ కమిటీ వద్ద ఇప్పటికే రాహుల్‌కు సంబంధించిన ఒక ఫిర్యాదు పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment