హైదరాబాద్: తమతో పాటు, సభలో లేని వ్యక్తులపై అనుచితంగా, అమర్యాదకరంగా మాట్లాడిన మంత్రులు, చీఫ్ విప్‌పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వాలని విపక్షం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. మంత్రులు దేవినేని ఉమా మహేశ్వరరావు, అచ్చెన్నాయుడు, రావెల కిశోర్ బాబుతో పాటు చీఫ్‌విప్ కాల్వ శ్రీనివాసులుపై మంగళవారం స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు.
తమతో దురుసుగా మాట్లాడటమే కాకుండా, సభలో లేని వ్యక్తుల గురించి మంత్రులు అనుచితంగా మాట్లాడారని వైఎస్‌ఆర్ సీపీ ఆరోపించింది. అలాగే సభ సమావేశాలకు సంబంధించిన వీడియో ఫుటేజ్‌ను మీడియాకు విడుదల చేయడంపై చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు తీరుపై వైఎస్ఆర్‌సీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది.
మంత్రులపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు
Published Tue, Mar 24 2015 11:36 AM | Last Updated on Sat, Aug 18 2018 8:54 PM
Advertisement
Advertisement