రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి అధిష్టానం ప్రత్యేక దృష్టి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో పార్టీ బలోపేతానికి అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించనుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ తెలిపారు. ఇక్కడ జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు శనివారం ముగిశాయి. అనంతరం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పార్టీ పరిస్థితిపై సమావే శంలో నివేదించినట్టు ఆయన చెప్పారు.
భద్రాచలంలో ఈ నెల 21, 22 తేదీల్లో నిర్వహించనున్న రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో పార్టీని బలోపేతం చేయడానికి కార్యాచరణ రూపొందించనున్నట్టు తెలిపారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా 3 రోజులపాటు రాష్ట్రంలో పర్యటించనున్నారని తెలిపారు. సమావేశంలో పార్టీ సమన్వయకర్త బాలరాజ్ పాల్గొన్నారు.