
'పన్నులు కడుతున్నా.. పనులు జరగడం లేదు'
హైదరాబాద్:
జీహెచ్ఎంసీలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డా. లక్ష్మణ్ మండిపడ్డారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్లో చాలా సమస్యలు ఉన్నాయన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని లక్ష్మణ్ పేర్కొన్నారు. పన్నులు కడుతున్నా పనులు జరగడం లేదని ధ్వజమెత్తారు.
విద్యుత్ సరఫరా అంశంలో ఇంకా మెరుగుపడాల్సి ఉందని సూచించారు. హైదరాబాద్ను కాపాడుకోకుంటే తెచ్చుకున్న తెలంగాణకు అర్థం లేదని ఆయన అన్నారు. ఇటీవలి కాలంలో హైదరాబాద్ అభివృద్ధి కుంటుపడిందన్నారు. హైదరాబాద్లో నాలాల్లో పూడికతీత పనులు చేపట్టాలని బీజేఎల్పీ నేత కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.