
కేంద్రంలో మారుతున్న సమీకరణలు
న్యూఢిల్లీ : కేంద్రంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే గెలుపు ఖాయమన్న సర్వేల నేపథ్యంలో ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకు బీజేడీ సిద్ధం అవుతోంది. ఆ పార్టీతో సహా ఏడు పార్టీలు తమ వైఖరిని మార్చుకున్నాయి. మరో అయిదు పార్టీలు కూడా బీజేడీనే అనుసరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
కాగా కేంద్రంలో ఎన్డీఎ కూటమి అధికారంలోకి వస్తే మద్దతు ఇస్తామని తాము హామీ యివ్వలేదని బీజేడీ అధినేత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నిన్న వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఎ కూటమి అధికారంలోకి వస్తే బీజేడీ షరతులతో కూడిన మద్దతు ఇస్తుందని ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో నవీన్ పట్నాయక్ వివరణ ఇచ్చారు. 2004 ఎన్నికల ముందు వరకు ఎన్డీఏ కూటమిలో బీజేపీ భాగస్వామిగా ఉంది.