కేంద్రంలో ఎన్డీఎ కూటమి అధికారంలోకి వస్తే మద్దతు ఇస్తామని తాము హామీయివ్వలేదని బీజేడీ అధినేత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ: కేంద్రంలో ఎన్డీఎ కూటమి అధికారంలోకి వస్తే మద్దతు ఇస్తామని తాము హామీయివ్వలేదని బీజేడీ అధినేత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు. బీజేపీతో ఎటువంటి సంప్రదింపులు జరపడం లేదని, తమ మధ్య ఎలాంటి చర్చలు జరగడం తేల్చిచెప్పారు.
కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఎ కూటమి అధికారంలోకి వస్తే బీజేడీ షరతులతో కూడిన మద్దతు ఇస్తుందని ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో నవీన్ పట్నాయక్ వివరణ ఇచ్చారు. 2004 ఎన్నికల ముందు వరకు ఎన్డీఏ కూటమిలో బీజేపీ భాగస్వామిగా ఉన్న సంగతి తెలిసిందే.