
ఒడిశాలో ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతుంది. ఈ తరుణంలో బీజేపీ అగ్రనేతలు ఒడిశాపై దృష‍్టి సారించారు. మోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌లు బీజేపీ అభ్యర్థుల తరుపున ప్రచారం చేయనున్నారు.
ప్రధాని మోదీ ఇటీవలే బెర్హంపూర్, నబరంగ్‌పూర్ లోక్‌సభ స్థానాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే మే 13న ఒడిశాలో మొదటి రౌండ్ ఎన్నికలకు ముందు కమలం నేతలు తమ ప్రచారాన్ని మరింత ఉదృతం చేయనున్నారు.
రాష్ట్ర బీజేపీ విశ్వసనీయ సమాచారం మేరకు మే 10న మోదీ భువనేశ్వర్‌లో రోడ్‌షో, మే 11న బొలంగీర్‌లో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించనున్నారు. ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ రెండు రోజుల పర్యటన నిమిత్తం మే 8న బరంగ్‌పూర్, కోరాపుట్‌లలో బహిరంగ సభలలో పాల్గొననున్నారు.
అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీలు హైవే ప్రాజెక్టులు, ఒడిశాలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఆవశ్యకత వంటి అంశాలను హైలైట్ చేయనున్నారు.
బీజేపీ జాతీయ నాయకులు,కేంద్ర మంత్రులతో ఎన్నికల ప్రచారం నిర్వహించగా.. మరోవైపు ఒడిశా అధికార బీజేడీ మాత్రం సీఎం పట్నాయక్ ఆయన సన్నిహితుడు పాండియన్ ద్వయం రాబోయే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం మే 13 నుంచి జూన్ మధ్య నాలుగు సార్లు సుడిగాలు పర‍్యటనలు చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment