నవీన్‌ పట్నాయక్‌ నామినేషన్‌ దాఖలు | Naveen Patnaik Files His Nomination In Morning | Sakshi
Sakshi News home page

రెండు చోట్ల నుంచి బరిలోకి బీజేడీ చీఫ్‌ నవీన్‌ పట్నాయక్‌

Published Wed, Mar 20 2019 5:29 PM | Last Updated on Wed, Mar 20 2019 5:34 PM

Naveen Patnaik Files His Nomination In Morning - Sakshi

నామినేషన్‌ పత్రాలను దాఖలు చేస్తున్న ఒడిషా సీఎం నవీన్‌ పట్నాయక్‌

భువనేశ్వర్‌: ఒడిషా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్‌ పార్టీ (బీజేడీ) అధ్యక్షుడు నవీన్‌ పట్నాయక్‌ బుధవారం నామినేషన్‌ వేశారు. ఆయన మొదటిసారి రెండు అసెంబ్లీ  స్థానాల బరిలో నిలువనున్నారు. అందులో ఒక స్థానం హింజిలీ కాగా మరొకటి బిజేపూర్‌. ఈ రెండు స్థానాల్లో ఎన్నికలు  ఏప్రిల్‌ 18న రెండో దఫాలో జరగనున్నాయి. హింజిలీ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఛత్రాపూర్‌ సబ్‌ కలెక్టర్‌ ఆఫీసులో నాలుగు సెట్ల నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశానని, త్వరలోనే బిజేపూర్‌లో మరో నామినేషన్‌ను వేస్తానని నవీన్‌ పట్నాయక్‌ మీడియాకు తెలిపారు. విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మళ్లీ ఒడిషాలో తామే గెలుస్తామని, బీజేడీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమన్న ధీమాని పట్నాయక్‌ వ్యక్తం చేశారు. నామినేషన్‌కు ముందు కొందరు బీజేడీ నాయకులతో కలిసి హింజిలీకి సమీపంలోని తరాతరిని దేవాలయాన్ని (గంజం జిల్లా) నవీన్‌ పట్నాయక్‌ సందర్శించారు. బీజేడీ అధినేత హింజిలీ నుంచి పోటీచేయడం ఇది ఐదోసారి.       

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement