నా ఫస్ట్‌ సినిమా.. నాన్న ఇంటికి వచ్చేయమన్నారు: కంగనా | Kangana Ranaut Parents Furious On Her Debut Film | Sakshi
Sakshi News home page

Kangana Ranaut: తొలి సినిమా.. నాన్న కోపం అంతా ఇంతా కాదు!

Aug 19 2024 8:17 AM | Updated on Aug 19 2024 9:18 AM

Kangana Ranaut Parents Furious On Her Debut Film

బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌.. 2006లో గ్యాంగ్‌స్టర్‌ సినిమాతో వెండితెరపై ప్రయాణం ఆరంభించింది. అయితే దర్శకుడు అనురాగ్‌ బసు, కంగనా ఓ కెఫెలో కలుసుకున్నారని, అలా ఆమెకు హీరోయిన్‌ ఛాన్స్‌ ఇచ్చాడని అప్పట్లో కథనాలు వెలువడ్డాయి.

అది నిజం కాదు
దాని గురించి తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో కంగనా మాట్లాడుతూ.. అందులో ఏమాత్రం నిజం లేదు. ఆడిషన్‌ ద్వారానే నన్ను సెలక్ట్‌ చేశారు. కాకపోతే సినిమాను ప్రమోట్‌ చేయాలంటే ఏదైనా కొత్తగా చెప్పాలి కదా.. అందుకే అలా స్టంట్లు చేశారు. బాలీవుడ్‌లో ఏం జరుగుతుంది? సినీప్రపంచం ఎలా ఉంటుందనేది మా ఇంట్లోవారికి పెద్దగా తెలీదు.

కోప్పడ్డారు
కాకపోతే వారికి అనురాగ్‌ బసు తెరకెక్కించిన మర్డర్‌ సినిమా తెలుసు. ఆ మూవీని డైరెక్ట్‌ చేసిన వ్యక్తే నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడని తెలిసి కోప్పడ్డారు. నాన్న.. వెంటనే పెట్టేబేడా సర్దుకుని ఇంటికి తిరిగి వచ్చేయమన్నాడు. ఎలాగోలా అతడిని ఒప్పించాను. 

హీరోయిన్‌ అవ్వాలనుకున్నా
పైగా అప్పుడే నా స్కూల్‌ అయిపోయింది. అంత చిన్న వయసులో నాలుగైదేళ్ల పిల్లవాడికి తల్లిగా నటించాలన్నారు. నిజానికి నాకన్నా ముందు నటి చిత్రాంగద సింగ్‌ను సెలక్ట్‌ చేశారు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఆ పాత్ర తిరిగి నా దగ్గరికే వచ్చింది. నేను హీరోయిన్‌ అవ్వాలనుకున్నాను. అందుకే అంతగా ఆలోచించకుండా ఓకే చెప్పేశాను అని చెప్పుకొచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement