
సిమ్లా: ఏప్రిల్ 19 నుంచి ఏడు దశల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు కోసం ఓ వైపు అధికార పక్షం, మరో వైపు ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ప్రచారం సాగిస్తున్నాయి. ఇటీవల బీజేపీ తరపున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి సీటు దక్కించుకున్న బాలీవుడ్ నటి, బీజేపీ అభ్యర్థి 'కంగనా రనౌత్' ప్రచారం మొదలు పెట్టారు.
హిమాచల్ ప్రదేశ్‌లోని మండిలో ప్రచారం ప్రారంభించిన కంగనా.. అధికారంలోకి వస్తే నియోజకవర్గ ప్రజలకు పూర్తి సమయం సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. బీజేపీ అభ్యర్థిగా పార్లమెంటులో 'మండి ప్రజల గొంతు' అవుతానని పేర్కొన్నారు. పాఠశాలలు, ఆసుపత్రులు మరియు రోడ్ల కోసం పని చేస్తానని, ప్రజల హక్కుల కోసం పోరాడతానని.. మండి కోసం నేను గొంతు పెంచుతానాని అన్నారు.
స్వామి వివేకానంద, సద్గురు జీ, ప్రధాని నరేంద్ర మోదీ తనకు స్ఫూర్తి అని కంగనా అన్నారు. ఇది నా జన్మభూమి.. నన్ను తిరిగి పిలిచింది. నన్ను ప్రజలు ఎన్నుకుంటే సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు.
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కంగనను లోక్‌సభ ఎన్నికల్లో మండి స్థానం నుంచి పోటీ చేయడానికి ఐదవ జాబితాలో అభ్యర్థిగా ప్రకటించింది. ఒకరికొకరు సహకరించుకోవడం బీజేపీ సంస్కృతి. అదే నమ్మకంతో వారితో కలిసి నడుస్తాం, గెలుస్తాం.. పెద్ద ఎత్తున ప్రచారం చేస్తాం’ అని ఆమె పేర్కొన్నారు. నేను బీజేపీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment