సిమ్లా: బీజేపీ తరపున ఎంపీ అభ్యర్థిగా బరిలోకి సినీ నటి 'కంగనా రనౌత్' మీద కాంగ్రెస్ శనివారం ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. పార్టీ సీనియర్ నేతలపై అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తూ హద్దులు దాటిందని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు.
మండిలోని సర్కాఘాట్‌లో జరిగిన బహిరంగ సభలో 'కంగనా రనౌత్' మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూను అప్పట్లో అత్యంత సంపన్నులు (ఆ కాలం నాటి అంబానీ) అని పేర్కొన్నారు. అయితే వారికి ఆ సంపద ఎక్కడ నుంచి వచ్చిందో ఎవరికీ తెలియదని అన్నారు.
బ్రిటీష్ వారికి సన్నిహితంగా ఉండేవారని, సంపద ఎక్కడి నుంచి వచ్చిందో ఇప్పటికీ రహస్యమే అని కంగనా కీలక వ్యాఖ్యలు చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు అనుకూలంగా ఓట్లు వచ్చినప్పటికీ.. జవహర్‌లాల్ నెహ్రూ ఎలా ప్రధాని అయ్యారో ఎవరికీ తెలియదని కూడా ఆమె ఆరోపించారు. అప్పటి నుంచి కుటుంబ పాలన మొదలైందని అన్నారు.
సంజయ్ గాంధీ మీద మాత్రమే కాకుండా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై కూడా అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. మంది నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న విక్రమాదిత్య సింగ్‌ను కూడా 'కార్టూన్' అని పిలిచారు.
స్వాతంత్య్ర సమరయోధులను వ్యాపారవేత్తలతో పోల్చడం, సంజయ్ గాంధీ, సోనియా గాంధీలను విమర్శించడం వంటి హద్దులు దాటిందని కాంగ్రెస్ నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులో పేర్కొన్నారు. కంగనాను తదుపరి ప్రచారంలో పాల్గొనకుండా ఆపాలని కాంగ్రెస్ ఫిర్యాదులో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment