చిన్నప్పుడు అలా ఉండేదాన్ని.. ఛాన్స్‌ దొరికితే చాలు! | Kangana Ranaut Shares Childhood Pics, I Was Funny Kid | Sakshi
Sakshi News home page

చిన్ననాటి ఫోటోలు షేర్‌ చేస్తూ బాల్యంలోకి వెళ్లిపోయిన కంగనా

Oct 9 2024 4:15 PM | Updated on Oct 9 2024 4:24 PM

Kangana Ranaut Shares Childhood Pics, I Was Funny Kid

బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంది. బాల్యంలోనూ కెమెరా ముందు పోజులిచ్చేదాన్నంటూ అందుకు సంబంధించిన పలు ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంది. నేడు (అక్టోబర్‌ 9న) ఆమె సోదరుడు అక్షత్‌ బర్త్‌డే. దీంతో అతడికి బర్త్‌డే విషెస్‌ కూడా తెలియజేసింది. చిన్నప్పుడు వీళ్లిద్దరూ ఒకరికొకరు తినిపించుకున్న ఫోటోను సైతం ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో యాడ్‌ చేసింది.

చిన్నప్పుడు అలా ఉండేదాన్ని
'నేను పాత ఆల్బమ్స్‌ చూసినప్పుడు అస్సలు నవ్వాపుకోలేను. ఎందుకంటే చిన్నప్పుడు భలే సరదాగా ఉండేదాన్ని. నేను దాచుకున్న డబ్బుతో చిన్న కెమెరా కొనుక్కుని ఎక్కడపడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు ఫోటోలు దిగేదాన్ని. మేము కారులో వెళ్లేటప్పుడు నాన్న ఒక్క నిమిషం కారు ఆపినా సరే వెంటనే బయటకు దిగి మళ్లీ ఫోటోలు క్లిక్‌మనిపించేదాన్ని.

క్లిక్‌.. క్లిక్‌.. క్లిక్‌..
చదువుకోమంటే గదిలోకి వెళ్లి ఫోటోకు పోజులిచ్చేేదాన్ని. తోటలోకి వెళ్లి ఏదైనా కూరగాయలు తెమ్మంటే కూడా అక్కడున్న మొక్కతో కలిసి ఫోటో దిగేదాన్ని. అద్దం ముందు దిగిన ఫోటోలో అయితే నాలో ఉన్న దర్శకురాలి ఆసక్తి ప్రస్ఫుటంగా కనిపిస్తోంది' అని రాసుకొచ్చింది.

సినిమా..
హిమాచల్‌ ప్రదేశ్‌లో పుట్టి పెరిగిన కంగనా.. సినిమాలపై ఆసక్తితో ముంబైకి వచ్చింది. 2006లో గ్యాంగ్‌స్టర్‌ మూవీతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఏక్‌ నిరంజన్‌, చంద్రముఖి 2 సినిమాల్లో నటించింది. ఈమె ప్రధాన పాత్రలో నటించి, స్వీయదర్శకత్వం వహించిన ఎమర్జెన్సీ మూవీ విడుదలకు సన్నద్ధమవుతోంది.

బిగ్‌బాస్‌ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement