లోక్‌సభ ఎన్నికల బరిలో మరో స్టార్ హీరోయిన్ నిలిచారు. ఇవాళ ప్రకటించిన బీజేపీ జాబితాలో బాలీవుడ్ క్విన్ కంగనా రనౌత్ సీటును కేటాయించారు. ఆమె సొంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్‌లోనే ఆమె పోటీ చేయనున్నారు. మండి లోక్‌సభ నియోజకవర్గం నుంచి కంగనా అభ్యర్థిత్వాన్ని బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసింది. ఈ విషయాన్ని కంగనా ట్విటర్ ద్వారా పంచుకున్నారు.
కంగనా తన ట్వీట్‌లో రాస్తూ..'నా ప్రియమైన భారత్, భారతీయ జనతా సొంత పార్టీ, బీజేపీకి ఎల్లప్పుడూ నా మద్దతు ఉంటుంది. ఈ రోజు బీజేపీ జాతీయ నాయకత్వం నా జన్మస్థలం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రమైన మండి నియోజకవర్గం నుంచి లోక్‌సభ అభ్యర్థిగా నన్ను ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడమనేది హైకమాండ్ నిర్ణయం. పార్టీలో అధికారికంగా చేరడం గౌరవంగా, ఆనందంగా భావిస్తున్నా. నేను ఒక కార్యకర్తగా, నమ్మకమైన ప్రజా సేవ కోసం ఎదురుచూస్తున్నా' అంటూ పోస్ట్ చేశారు.
ఇక సినిమాల విషయానికొస్తే గతేడాది చంద్రముఖి-2, తేజస్ సినిమాలతో మెప్పించింది. ఈ ఏడాదిలో ఎమర్జన్సీ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇటీవలే లోక్‌సభ బరిలో మరో సీనియర్ హీరోయిన్ రాధిక శరత్‌కుమార్ సైతం తమిళనాడులోని విరుధునగర్ నుంచి పోటీలో నిలిచారు.
My beloved Bharat and Bhartiya Janta’s own party, Bharatiya Janta party ( BJP) has always had my unconditional support, today the national leadership of BJP has announced me as their Loksabha candidate from my birth place Himachal Pradesh, Mandi (constituency) I abide by the high…
— Kangana Ranaut (@KanganaTeam) March 24, 2024
Comments
Please login to add a commentAdd a comment