
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. హిమాచల్‌ప్రదేశ్ కాంగ్రెస్ కంచుకోట మండి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న ఆమె కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు.
తప్పుడు వాగ్దానాలతో ప్రజల్ని మభ్యపెట్టిన కాంగ్రెస్ ఇప్పటి వరకు ఏమైనా చేసిందా? అని ప్రశ్నించారు. ఇకపై కాంగ్రెస్ పార్టీ వాగ్దానాల పట్ల హిమాచల్ ప్రదేశ్ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, బదులుగా ప్రధాని నరేంద్ర మోదీ విజన్‌కు మద్దతివ్వాలని రనౌత్ కోరారు.
మరోవైపు జోగిందర్‌నగర్‌లో ప్రచారం చేసిన కంగనా ఓటర్లతో కలిసి ఆమె స్టెప్పులేశారు. కంగనా రనౌత్ డ్యాన్స్‌కు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
#WATCH | Himachal Pradesh: BJP candidate from Mandi Kangana Ranaut dances with people during a public meeting in Mandi's Jogindernagar. pic.twitter.com/k3PODhNg9j
— ANI (@ANI) April 13, 2024