భారతదేశంలో ఏర్పడ్డ ఎమర్జెన్సీ (25 జూన్ 1975 – 21 మార్చి 1977) పరిస్థితుల ఆధారంగా హిందీలో తెరకెక్కిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. కంగనా రనౌత్ నటించి, స్వీయ దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఈ చిత్రంలో భారతదేశ దివంగత మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ పాత్రలో కంగనా రనౌత్ నటించారు. అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, అశోక్ చబ్రా, మహిమా చౌదరి ఇతర లీడ్ రోల్స్‌లో నటించిన ఈ సినిమాను కంగనా రనౌత్, పి. రేణు నిర్మించారు.
ఈ సినిమాను తొలుత గత నవంబరులో విడుదల చేయాలనుకున్నారు. కానీ కుదర్లేదు. ఆ తర్వాత ఈ ఏడాది జూన్ 14న రిలీజ్‌కు ప్లాన్ చేశారు. ఆ తేదీకి కూడా రాలేదు. తాజాగా ‘ఎమర్జెన్సీ’ని సెప్టెంబరు 6న విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించి, కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ‘‘భారతదేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులు ఏర్పడి జూన్ 25 నాటికి 49 సంవత్సరాలు పూర్తయి, 50వ ఏడాదిలోకి అడుగుపెట్టాం. నాటి పరిస్థితుల నేపథ్యంలో తీసిన ‘ఎమర్జెన్సీ’ని సెప్టెంబరు 6న విడుదల చేస్తున్నాం. భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలోని ఈ వివాదాస్పదమైన ఎపిసోడ్‌ను మా సినిమాలో చూపించబోతున్నాం’’ అని యూనిట్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment