దేశంలో ప్రస్తుతం 2024 లోక్‌సభ ఎన్నికలు జరుగుతుండగా, కొన్ని స్థానాలు ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వాటిలో హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ లోక్‌సభ నియోజకవర్గం ఒకటి. ఇక్కడి నుండి బీజేపీ అభ్యర్థిగా నటి కంగనా రనౌత్ రంగంలోకి దిగారు.
తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ నటిగా తనకు అనేక జాతీయ అవార్డులు, పద్మశ్రీ అవార్డులు వచ్చినా, రాబోయే కాలంలో మండీ ప్రాంత అభివృద్ధే తనకు ముఖ్యమని తెలిపారు. ఈ ప్రాంత అభివృద్ధికి తాను కృషి చేస్తానని, అప్పుడు తనకు ‘ఎంపీ ఆఫ్ ద ఇయర్’ అవార్డు వస్తే చాలా సంతోషిస్తానని తెలిపారు. భవిష్యత్తులో తనకు ఏదైనా మంత్రిత్వ శాఖ లేదా ఏదైనా పెద్ద పదవి అప్పగిస్తే బాధ్యతగా నెరవేరుస్తానని అన్నారు. తాను ముందుగా మండి అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
కంగనా తన సినిమా ప్రాజెక్ట్‌ల గురించి మాట్లాడుతూ ప్రస్తుతం తన చేతిలో చాలా సినిమాలు ఉన్నాయని, తన కొత్త సినిమా ‘ఎమర్జెన్సీ’ త్వరలోనే విడుదల కాబోతున్నదని కంగనా తెలిపారు. ఎన్నికల ప్రచారం కారణంగా తాను హీరో ఆర్ మాధవన్‌తో చేస్తున్న సినిమాకు గ్యాప్ ఇచ్చానని తెలిపారు. దానిని తిరిగి ప్రారంభించాల్సి ఉందని, అలాగే మరో మూడునాలుగు సినిమాలకు సైన్ చేశానని తెలిపారు.
యాపిల్ పండించే రైతుల గురించి కంగనా మాట్లాడుతూ, వారికి కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. యాపిల్ ధరల పెంపు తదితర విషయాలపై అధికార యంత్రాంగంతో చర్చించాల్సి ఉందన్నారు. బీజేపీ అభ్యర్థిగా సొంత వాగ్దానాలు చేయకూడదని పార్టీ ఆదేశించిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment