
కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పై బాలీవుడ్ నటి, మండి లోక్‌సభ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాహుల్ అధికారం కోసం దేశాన్ని విడదీయడానికి కూడా వెనుకాడరని వ్యాఖ్యానించారు.
భారత్‌లో కొన్ని మతాలు, భాషలు మిగిలిన వాటికంటే తక్కువనే భావన ఆరెస్సెస్‌లో ఉందని అమెరికా పర్యటనలో రాహుల్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై కంగన తాజాగా స్పందిస్తూ కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు మన దేశంపై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో ప్రజలందరికీ తెలుసని అన్నారు అధికారం కోసం దేశాన్ని విడదీయడానికి కూడా ఆయన వెనుకాడరని విమర్శలు గుప్పించారు.
అనంతరం తన ‘ఎమర్జెన్సీ’ సినిమా విడుదల వాయిదాపై కంగనా స్పందిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఈ చిత్రాన్ని నేను ఏవిధంగా తెరకెక్కించానో నాకు తెలుసు. చిత్రబృందం నుంచి నాకు ఎలాంటి సపోర్ట్ లేదు. ఇదొక భారీ బడ్జెట్ మూవీ. జీ, కొందరు వ్యక్తుల భాగస్వామ్యంతో దీనిని నిర్మించాను. ఈ సినిమా రిలీజ్ ఆలస్యమవుతున్నకొద్దీ మేము ఎన్నో నష్టాలు ఎదుర్కొంటున్నాం. మా చిత్రాన్ని వీలైనంత త్వరగా విడుదల చేయాల్సిన బాధ్యత సెన్సార్‌పై ఉంది’’ అని ఆమె చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment