
న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ను కొట్టినందుకు సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ సస్పెండ్ అయ్యారు. అయితే, తాజా పరిణామాలపై కుల్విందర్ కౌర్ స్పందించారు. ఈ ఉద్యోగం పోతుందనే భయం లేదు.. అందుకు నేను సిద్ధంగా ఉన్నాను. నా తల్లి గౌరవం కోసం అలాంటి వేలాది ఉద్యోగాలను కోల్పోయేందుకు సిద్ధంగా ఉన్నానని ట్వీట్ చేశారు.
కంగనా రనౌత్ గతంలో వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేసిన ధర్నాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ ధర్నా చేసిన వారిలో తన తల్లి కూడా ఉందంటూ సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్.. చండీగఢ్ నుంచి ఢిల్లీ వెళ్తున్న కంగనాను చెంప దెబ్బకొట్టింది. రైతులను అగౌరపరించినందుకు తాను ఈ పనిచేసినట్లు కుల్విందర్ కౌర్ చెప్పారు.
ఈ ఘనటపై కొన్ని గంటల్లోనే ఆమె సస్పెండ్ అయ్యారు. విచారణకు ఆదేశించారు. ఈ ఉదయం పోలీసులు కుల్విందర్ కౌర్‌ను అరెస్ట్ అయ్యారు.
కాగా, కంగనాపై చేయి చేసుకున్న కుల్విందర్ కౌర్‌కు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ దద్లానీ అండగా నిలిచారు. ఆమె ఒప్పుకుంటే ఆమెకు తగిన ఉద్యోగం ఇస్తామని తెలిపారు. అంతేకాదు ఎవరైనా మీ తల్లి రూ.100కే అందుబాటులో ఉందని కామెంట్ చేస్తే మీరేం చేస్తారు? అని ప్రశ్నించారు.
मुझे नौकरी की फिक्र नहीं है,
मां की इज्जत पर ऐसी हजारों नौकरियां कुर्बान है- कुलविंदर कौर— Kulvinder Kaur (@Kul_winderKaur) June 7, 2024
Comments
Please login to add a commentAdd a comment