న్యూఢిల్లీ: ప్రజామోదం కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉందని ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియాగాంధీ వ్యాఖ్యానించారు. త్వరలో జరగబోయే కీలకమైన రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు సంసిద్ధం కావాలని నేతలకు ఆమె దిశానిర్దేశం చేశారు. బుధవారం ఆమె పార్టీ నేతలు, కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు.
‘‘లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పట్ల ప్రజల్లో సానుకూలత బాగా పెరిగింది. ఇది చూసి అతివిశ్వాసాన్ని మీ దరి చేరనీయకండి’ అని నేతలకు హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment