సోనియా గాంధీకి ‘నూరీ’ ఇష్టం | Rahul Gandhi on pics of Sonia with pet dog Noorie | Sakshi
Sakshi News home page

సోనియా గాంధీకి ‘నూరీ’ ఇష్టం

Aug 25 2024 10:40 AM | Updated on Aug 25 2024 1:45 PM

Rahul Gandhi on pics of Sonia with pet dog Noorie

ఇన్‌స్టాగ్రామ్‌లో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పోస్టు  

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాందీకి ఎవరంటే ఎక్కువ ఇష్టం? కుమారుడు రాహుల్‌ గాం«దీనా? లేక కుమార్తె ప్రియాంక గాందీనా? వీరిద్దరూ కాదు. బుజ్జి కుక్కపిల్ల ‘నూరీ’ అంటే సోనియాకు చాలా అభిమానం. ఈ విషయం రాహుల్‌ గాంధీ స్వయంగా వెల్లడించారు కాబట్టి మనం నమ్మక తప్పదు. 

జాక్‌ రస్సెల్‌ బ్రిటీష్‌ జాతికి చెందిన నూరీని బ్యాక్‌ప్యాకప్‌లో వీపుపై సోనియా కట్టుకున్న సరదా ఫోటోను రాహుల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్టు చేశారు. మామ్స్‌ ఫేవరేట్‌ అనే వ్యాఖ్య జోడించారు. తన తల్లికి కన్నబిడ్డల కంటే నూరీనే ఎక్కువ ఇష్టమని పేర్కొన్నారు. ఇంట్లో నూరీని చాలా ముద్దు చేస్తుంటారని తెలిపారు. రాహుల్‌ పోస్టుకు నెటిజన్ల నుంచి విశేషమైన స్పందన లభించింది. 24 గంటల వ్యవధిలో 7.81 లక్షల లైక్‌లు, 5,400 కామెంట్లు వచ్చాయి. నిజానికి కుక్కపిల్ల నూరీని రాహుల్‌ గతేడాది స్వయంగా సోనియాకు బహూకరించారు.

 

అప్పటి నుంచి అది ఆమెకు ప్రీతిపాత్రమైపోయింది. సోనియా కుటుంబంలో ఇప్పుడు అందరికీ అదొక ముఖ్యమైన, ప్రియమైన సభ్యురాలు. ఉత్తర గోవాలోని మపూసా పట్టణంలో 2023 ఆగస్టులో నూరీని రాహుల్‌ గాంధీ తొలిసారిగా చూశారు. దానిపై ముచ్చటపడ్డారు. కొనుగోలు చేసి, తల్లికి బహూకరించి ఆశ్చర్యపరిచారు. సోనియా కుటుంబ సభ్యులకు జంతవులంటే చాలా ఆపేక్ష. వారి ఇంట్లో చాలాఏళ్లుగా పలు శునకాలు ఉన్నాయి. ‘పిడి’ అనే శునకం రాహుల్‌ గాంధీ సోషల్‌ మీడియా పోస్టులో తరచుగా కనిపిస్తూ ఉంటుంది. దానికి చాలామంది అభిమానులున్నారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement