సాక్షి, ఢిల్లీ: సోనియా గాంధీని తెలంగాణ ఉత్సవాలకు ఆహ్వానించిన రేవంత్.. బీజేపీ నాయకులకు ఆహ్వానం ఇవ్వలేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ మండిపడ్డారు. శనివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఇచ్చిన మాట సోనియా వెనక్కి తీసుకోవడం వల్లే ఆత్మహత్యలు జరిగాయని వ్యాఖ్యానించారు.
కేసీఆర్‌ను వెతికి మరి ఆహ్వానం ఇచ్చి ప్రేమ ఒలకబోసిన రేవంత్‌కు, తెలంగాణకు మద్దతు ఇచ్చిన బీజేపీని ఎందుకు పిలవడం లేదని ప్రశ్నించారు. సోనియా, కేసీఆర్ ఒకే వేదిక పంచుకునేలా ఎత్తుగడ వేశారు. ఫోన్ ట్యాపింగ్‌లో బయటపడేందుకు కేసీఆర్, కాంగ్రెస్‌ను అన్ని రకాల లోబరుచుకున్నారు. అందుకే కాళేశ్వరం కేసు, ఫోన్ ట్యాపింగ్‌పై రేవంత్ చర్యలు తీసుకోవడం లేదు. అందుకే ఈ కేసుల దర్యాప్తు సీబీఐకి అప్పగించాలి’’ బండి సంజయ్ డిమాండ్ చేశారు.
‘‘కేంద్రం దర్యాప్తు చేస్తే, కవిత అరెస్టు ఎలా జరిగిందో చూశారు. ఏఐసీసీకి తెలంగాణ ఒక ఏటిఎంగా మారింది. తెలంగాణ అధికారిక చిహ్నంలో చార్మినార్ ఉండొద్దు. తెలంగాణ అధికారిక చిహ్నంలో అమర వీరుల స్తూపం ఉంటే మంచిదే’’ అని బండి సంజయ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment