సాక్షి, ఢిల్లీ: వృద్ధాప్యం, అనారోగ్య కారణాలతో కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియా గాంధీ ప్రత్యక్ష రాజకీయాలకు దూరం కానున్నట్లు సమాచారం. సోనియాను రాజ్యసభకు పంపాలని పార్టీ అగ్ర నాయకత్వం యోచిస్తునట్లు తెలిసింది.
లోక్‌సభ ఎన్నికలకు ముందు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న ఏఐసీసీ.. సోనియాను రాజస్ధాన్ నుంచి రాజ్యసభకు పంపించాలని కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఇటీవల సోనియా గాంధీని కలిసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. ఖమ్మం నుంచి పోటీ చేయాలని కోరిన సంగతి తెలిసిందే.
ఇక సోనియా గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న రాయ్ బరేలి నుంచి ప్రియాంక గాంధీ లోక్‌సభ ఎన్నికల బరిలో ఉంటారని సమాచారం. రాయ్ బరేలి నుంచి ప్రియాంక గాంధీ పోటీలో ఉంటే ఉత్తరాదిలోని కీలక రాష్ట్రంలో విపక్ష కూటమికి అనుకూల వాతావరణం నెలకొనే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.
ఇదీ చదవండి: బలపరీక్ష నెగ్గిన నితీష్ సర్కార్
Comments
Please login to add a commentAdd a comment