లక్నో: అయోధ్యలో జనవరి 22న జరగనున్న రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి కీలక విపక్ష నేతలకు కూడా ఆహ్వానం అందింది. కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, మల్లికార్జున్ ఖర్గే, అధిర్ రంజన్ చౌదరి, జేడీ(ఎస్) అధినేత దేవేగౌడలకు ఆహ్వానాలు పంపినట్లు విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ తెలిపారు. రానున్న రోజుల్లో మరింత మంది విపక్ష నేతలకు ఆహ్వానాలు అందే అవకాశం ఉందని సమాచారం. అయితే.. ఈ కార్యక్రమానికి విపక్ష నేతలు గౌర్హాజరయ్యే అవకాశం ఉంది.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ వేడుకకు హాజరవనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన సన్నాహాలు ఇప్పటికే జోరందుకున్నాయి. జనవరి 15 నాటికి ఏర్పాట్లన్నీ పూర్తి కానున్నాయి. ప్రాణ ప్రతిష్ట పూజ జనవరి 16న ప్రారంభమై జనవరి 22కు ముగియనుంది.
రామ మందిర ప్రతిష్ఠాపన వేడుకలో భాగంగా జనవరి 17న 100 దేవతా విగ్రహాలతో శ్రీరాముడి జీవితంలోని దృశ్యాలను ప్రదర్శిస్తూ ఊరేగింపు ఉంటుంది. ఈ ఊరేగింపులో శ్రీరాముడు పుట్టినప్పటి నుంచి వనవాసం వరకు సాగిన జీవితం, లంకపై విజయం, అయోధ్యకు తిరిగి రావడం వంటి చిత్రాలు ఉంటాయని ప్రధాన శిల్పి రంజిత్ మండల్ తెలిపారు.
ఇదీ చదవండి: లాలూ, తేజస్వీలకు ఈడీ సమన్లు
Comments
Please login to add a commentAdd a comment