సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యాన్ని (డీఏ) 2.096 శాతం పెంచుతూ సర్కారు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది జనవరి నుంచే ఇది అమల్లోకి వస్తుందని పేర్కొంటూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఉద్యోగులకు మూల వేతనంపై 22.008 శాతం డీఏ అమల్లో ఉంది. పెరిగిన డీఏతో కలిపి 24.104 శాతానికి చేరుతోంది. దీనితో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు నాలుగున్నర లక్షల మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. డీఏ పెంపుతో ప్రభుత్వంపై ఏటా రూ.400 కోట్ల భారం పడుతుందని అంచనా.
ఈ నెల నుంచి నగదుగా..
సెప్టెంబర్æ నెల వేతనం నుంచి పెరిగిన డీఏను నగదుగా చెల్లిస్తారు. అంటే దసరా పండుగకు ముందే ఈ నెల 25న చెల్లించే జీతంతో పెరిగిన డీఏ ఉద్యోగుల చేతికి అందనుంది. ఇక జనవరి నుంచి ఆగస్టు వరకు ఉన్న బకాయిని ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌లో కొనసాగుతున్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు 90 శాతం బకాయిలు నగదుగా చెల్లిస్తారు. మిగతా పది శాతాన్ని ప్రాన్ (పీఆర్‌ఏఎన్) ఖాతాలో జమ చేస్తారు. బకాయిలకు సంబంధించి నవంబర్ 30లోగా ట్రెజరీ, పే అండ్ అకౌంట్స్ కార్యాలయాల్లో బిల్లులు సమర్పించాలని ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది.
పెన్షనర్లపై త్వరలో ఉత్తర్వులు
ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ పెరి గిన డీఏ వర్తిస్తుంది. జిల్లా పరిషత్, మం డల పరిషత్, గ్రామ పంచాయతీ, మున్సి పాలిటీలు, కార్పొరేషన్లు, మార్కెట్ కమి టీలు, జిల్లా గ్రంథాలయ సంస్థల్లో రెగ్యు లర్ జీతంపై పనిచేస్తున్న వారికి, రాష్ట్రం లోని వర్సిటీలు, ఎయిడెడ్ విద్యా సంస్థలు, ఎయిడెడ్ పాలిటెక్నిక్‌లలో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి, ఉద్యో గులకు పెరిగిన డీఏ వర్తిస్తుంది. అయితే పెన్షనర్లకు సంబంధించిన కరువు భృతి ఉత్తర్వులను ఒకటి రెండు రోజుల్లో విడు దల చేయనున్నట్లు సమాచారం.