అత్యవసర సేవలు తప్ప మిగతా వైద్యం అక్కడే
ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో వైద్యులు, టెక్నీషియన్ల నియామకం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులు, రిటైరైన సిబ్బంది ఇకపై ఉచిత చికిత్సల కోసం తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రికి వరకు రావాల్సిన బాధ తప్పనుంది. ఆర్టీసీ ఆసుపత్రికి అనుబంధంగా ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన డిస్పెన్సరీలను ఆసుపత్రులుగా మారుస్తుండటమే అందుకు కారణం. నిధుల సమస్యతో ఇంతకాలం డిస్పెన్సరీలను బాగుచేయలేని పరిస్థితి నెలకొనగా తాజాగా వాటిని ఉద్యోగులకు చేరువ చేసేలా ఎండీ సజ్జనార్ చర్యలు తీసుకున్నారు.
వైద్యులు.. పరికరాలు.. మందులు..
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 14 చోట్ల ఆర్టీసీ డిస్పెన్సరీలున్నాయి. వాటిల్లో నాలుగు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. కానీ కొన్ని డిస్పెన్సరీల్లో వైద్యులు లేరు. అలాగే ఎక్కడా కూడా వైద్య పరికరాలు లేవు. ఇప్పుడు అన్ని డిస్పెన్సరీలకూ వైద్యులను కేటాయించారు. నలుగురు వైద్యులను ప్రభుత్వం కేటాయించగా మిగతా వైద్యులను, టెక్నీíÙయన్లను అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో ఆర్టీసీ సమకూర్చుకుంది. వారు స్థానికంగా అందుబాటులో ఉంటూ సాధారణ చికిత్సలకు పూర్తిస్థాయిలో సేవలందించనున్నారు.
అయితే ఎమర్జెన్సీ కేసులకు మాత్రం కీలక చికిత్సలు డిస్పెన్సరీల్లో ఉండవు. అత్యవసర వైద్యం అవసరమయ్యే రోగులు ఆర్టీసీ ప్రధాన ఆసుపత్రికో లేదా ఆర్టీసీ రిఫరల్ జాబితాలోని ప్రైవేటు ఆసుపత్రులకో వెళ్లే వరకు అవసరమయ్యే ప్రాథమిక చికిత్సలు అందిస్తారు. అలాగే అన్ని రకాల మందులను కూడా డిస్పెన్సరీల్లో సమకూరుస్తున్నారు. ఆర్టీసీ ప్రధాన ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న వారు మందుల కోసం ప్రతిసారీ హైదరాబాద్‌కు రావాల్సి వస్తోంది.
ఇకపై డిస్పెన్సరీల్లోనే ఉచితంగా మందులు అందిస్తారు. మరోవైపు కొత్తగా ఏర్పడ్డ పెద్ద జిల్లా కేంద్రాల్లో కూడా డిస్పెన్సరీలు ఏర్పాటు చేయాలన్న నిర్ణయంలో భాగంగా తాజాగా నాగర్‌కర్నూల్‌లో డిస్పెన్సరీ ఏర్పాటైంది. మిగతా వాటిల్లో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment