ఆర్టీసీకి ‘ప్రవాస్‌ 4.ఓ రెడ్‌బస్‌ పీపుల్స్‌ చాయిస్‌’ అవార్డు | APSRTC bags Prawaas 4 0 Peoples Choice Award | Sakshi
Sakshi News home page

ఆర్టీసీకి ‘ప్రవాస్‌ 4.ఓ రెడ్‌బస్‌ పీపుల్స్‌ చాయిస్‌’ అవార్డు

Published Sat, Sep 7 2024 4:16 AM | Last Updated on Sat, Sep 7 2024 4:16 AM

APSRTC bags Prawaas 4 0 Peoples Choice Award

సాక్షి, అమరావతి: వరుసగా రెండో ఏడాది ఏపీఎస్‌ ఆర్టీసీ ‘ప్రవాస్‌ 4.ఓ రెడ్‌బస్‌ పీపుల్స్‌ చాయిస్‌ అవార్డు’ను సాధించింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తున్నందుకు గాను ఈ అవార్డును ప్రకటించారు. 

ప్రవాస్‌ 4.ఓ అవార్డును సాధించడంపై ఆర్టీసీ ఎండీ సీహెచ్‌.ద్వారకా తిరుమలరావు సంతోషం వ్యక్తం చేశారు. ఆర్టీసీ అధికారులు, సిబ్బందిని శుక్రవారం అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఈడీలు కేఎస్‌ బ్రహా్మనందరెడ్డి, చంద్రశేఖర్, వి.సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement