MD ramana rao
-
ఆర్టీసీలో సోలార్ కాంతులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలు, ప్రధాన స్టేషన్లలో సౌర విద్యుత్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి ఆర్టీసీ సంకల్పించింది. తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణ శక్తి అభివృద్ధి సంస్థ(టీఎస్ఆర్ఈడీసీఓ) అధికారులతో చర్చించిన తర్వాత ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఎండీ రమణారావుతో టీఎస్ఆర్ఈడీసీఓ డైరెక్టర్ సుధాకర్‌రావు, అధికారులు ఒప్పంద పత్రాలపై పరస్పరం సంతకాలు చేశారు. ఒప్పందం 25 ఏళ్ల పాటు అమలులో ఉంటుందని సోమారపు తెలిపారు. సోలార్ వినియోగంతో ఖర్చులు తగ్గడమే కాకుండా పర్యావరణానికి మేలు జరుగుతుందని ఆర్టీసీ ఎండీ రమణారావు తెలిపారు. -
నష్టాల్లోనే నిజామాబాద్ రీజియన్
సాక్షి, నిజామాబాద్‌నాగారం(నిజామాబాద్‌అర్బన్): అసలే నష్టాల్లో ఉన్న ఆర్టీసీని చక్కదిద్దడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా నిజామాబాద్ రీజీయన్ పరిస్థితి మరీ దారుణంగా తయారైందని ఆర్టీసీ ఎండీ జీవీ రమణారావు అన్నారు. లాభాల్లో ఉన్న డీపోలు సైతం ఆదాయం తేలేకపోతున్నామని ఆర్ఎమ్, డిపో మేనేజర్లు అందరూ ప్రత్యేకంగా తనీఖీలు చేస్తూ. ఆర్టీసీకీ ఆదాయం తెచ్చే విధంగా ప్రతి ఒక్కరు శ్రమించాల్సిందేనని అన్నారు. సోమవారం నిజామాబాద్ రీజీయన్కు సమీక్ష నిమిత్తం ఏడాది తర్వాతా జిల్లాకు వచ్చారు. ఆర్ఎమ్ కాన్ఫరెన్సుహాల్లో మధ్యాహ్నాం 12గంటల నుంచి రాత్రి 8గంటల వరకు ఎండీ సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్బంగా ఎండీ మాట్లాడుతూ గతంలో నిజామాబాద్ రీజీయన్కు చాలా పేరుండేదని ఆదాయ వనరుల కేంద్రంగా ఉన్న జిల్లాలో ఆర్టీసీకీ సైతం పెద్దగా నష్టాలు రాలేదన్నారు. నిజామాబాద్ డిపో–1, డిపో–2లు రాష్ట్రంలోనే లాభాల్లో పోటీ పడేవన్నారు. కానీ గత ఏడాది నుంచి రెండు డిపోల పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. లాభాలు చాలా తగ్గాయన్నారు. ఇదీ ఇలాగే కొనసాగితే నష్టాల్లోకి వెళ్తామన్నారు. ఎట్టి పరిస్థితిలో లాభాలు తగ్గకుండా ప్రతి రోజు, ప్రతి నెల లాభాలు పెరుగుతు రావాల్సిందే అన్నారు. డిపో మేనేజర్లు మరింత బాధ్యతతో శ్రమించాలి అనిఅన్నారు. బాన్సువాడ, బోధన్ డిపోలపై సీరియస్ నిజామాబాద్ రీజియన్‌లోని బాన్సువాడ, బోధన్ డిపోలు అత్యంత దారుణంగా ఉన్నాయన్నారు. నష్టాలు ఎక్కువ మొత్తంలో రావడంపై సీరియస్ అయ్యారు. డిపో మేనేజర్లు, సిబ్బంది సమన్వయం లేకనే భారీ నష్టాలు వస్తున్నాయన్నారు. డిపో మేనేజర్లు బాధ్యతయుతంగా విధులు నిర్వహిస్తే ఇలాంటి పరిస్థితి వచ్చేదికాదన్నారు. రీజీయన్లోనే ఈ రెండు డిపోలు నష్టాలు మూటగట్టుకున్నాయన్నారు. నష్టాలు తగ్గడానికి ప్రత్యామ్నయా చర్యలు చేపట్టకపోవడంపై ఎండీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఆర్మూర్, కామారెడ్డి డిపోలు సైతం నష్టాలు పరిస్థితి మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. నష్టాలు తగ్గుతూ లాభాల్లోకి రావాల్సిందే అన్నారు. అంతర్రాష్ట్ర సర్వీసులు ప్రారంభిస్తాం ఆర్టీసీ బస్టాండ్ నుంచి త్వరలోనే ముంబాయికి బస్సులు నడిపేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రైవేట్ వాహనాలు ఎంత పోతున్నాయో, వాటికి సంబంధించి లెక్కలు అన్ని చూసుకోని బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రయాణీకులు ఆదరిస్తే ఖచ్చితంగా నడిపితీరుతామన్నారు. ఇప్పటికే అంతరాష్ట్ర సర్వీసులు ప్రారంభించామన్నారు. ఆర్టీసీకి వచ్చే ఆదాయన్ని ఎట్టి పరిస్థితులో వదులుకోమన్నారు. ఒక్కరు రెండు విధులు చేయాల్సిందే ఆర్టీసీలో పరిస్థితులు మార్పులు జరుగుతునే ఉన్నాయన్నారు. మార్పులకు అనుగుణంగా మారాల్సిందే అన్నారు. గతంలో టిమ్ మిషన్లు తీసుకరావడం జరిగిదని, ఇప్పుడు డ్రైవరే టిమ్స్ ద్వారా కండక్టర్ పనులు చేస్తు డ్రైవింగ్ చేస్తున్నారన్నారు. ఇంద్ర, డీలక్స్ బస్సుల్లో ఇదే నడుస్తుందని, వజ్రబస్సుల్లో, అదే విధంగా ఇప్పుడు జిల్లాలో అక్కడక్కడ నడుపుతున్న నాన్‌స్టాప్ బస్సుల్లో సైతం డ్రైవర్చేత రెండు పనులు చేయిస్తున్నామని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే డ్రైవర్ రెండు పనులు చేస్తున్నారని, మన దగ్గర కూడా అదే పరిస్థితి ఉంటుందన్నారు. 4వేల మంది కార్మికులను రెగ్యులర్ చేశాం ఆర్టీసీలో ఒకేసారీ 4వేల మంది కార్మికులను రాష్ట్రం వచ్చిన తర్వాతా రెగ్యులర్ చేశామన్నారు. దీంతో కారుణ్య నియమకాలు భర్తి చేయడం జరిగిందని, కార్మికులు ఇప్పటీకే ఎక్కువగా ఉన్నారన్నారు. అందుకే రిక్రూట్మెంట్ చేయడం లేదన్నారు. ప్రతి బస్టాండ్లల్లో సీసీ కెమోరాలు ఏర్పాటు చేయటానికి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రయాణీకుల భదత్రే మా లక్ష్యం అన్నారు. ఆర్టీసీ బస్టాండ్, డిపోల ఖాళీ ప్రదేశాల్లో పెట్రోల్ బంకులు ఏర్పాటు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అధికారులు, కార్మికులు అందరూ కలిసి కట్టుగా శ్రమించాల్సిందే అన్నారు. సమిష్టి కృషితో ఆర్టీసీ వృద్ధిలోకి వస్తుందన్నారు. సమీక్షలో ఆర్ఎమ్ కె.ఎస్.ఖాన్, డీవీఎం గణపతిరావు, పీఓ శ్రీనివాస్, డిపోల మేనేజర్లు ఆనంద్, సాయన్న, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎండీని కలిసిన వివిధ సంఘాల నాయకులు ఆర్టీసీ ఎండీ జీవీ రమణారావు జిల్లాకు రావడంతో వివిధ సంఘాల నాయకులు ప్రత్యేకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించారు. అనంతరం వినతిపత్రాలు సమర్పించారు. ఇందులో టీఎమ్‌యూ నుంచి మురళి, శ్రీనివాస్, మాక్లూర్ శేఖర్, ఎన్ఎమ్యు నుంచి ఎన్ఎ కుమార్, ఈయు నుంచి సాయిలు, సాయిప్రసాద్, అబ్బయ్య, బిసి సంఘం నుంచి శ్రీనివాస్, బికేయు నుంచి పరుశురాం, ఎస్‌డబ్లు్యఎఫ్ నుంచి సంజీవ్‌లు కలిసి సమస్యలపై విన్నవించారు. -
తెలంగాణ ఆర్టీసీకి ఇంధన పొదుపు పురస్కారం
ఢిల్లీలో అవార్డు అందుకున్న ఎండీ రమణరావు సాక్షి, హైదరాబాద్: ఇంధన పొదుపులో తనకు తిరుగులేదని మరోసారి తెలంగాణ ఆర్టీసీ నిరూపించింది. 4 వేల నుంచి 10 వేల బస్సులున్న రవాణా సంస్థల కేటగిరీలో రాష్ట్ర ఆర్టీసీ ఉత్తమ ఇంధన పొదుపు రవాణా సంస్థగా నిలిచింది. ఢిల్లీలోని కన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగిన అసోసియేషన్ ఆఫ్ స్టేట్రోడ్ ట్రాన్స్‌పోర్టు అండర్‌టేకింగ్స్ (ఏఎస్ఆర్టీయూ) 61వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ అవార్డును సంస్థ ఎండీ రమణరావు అందుకున్నారు. ఏఎస్ఆర్టీయూ అధ్యక్షుడు సంజయ్‌మిత్ర ఈ అవార్డును అందజేశారు. 2015–16 సంవత్సరానికి 5.5 కేఎంపీఎల్ సాధించినందుకు ఈ అవార్డును పొందింది. మెరుగైన కేఎంపీఎల్ ద్వారా 9.4 లక్షల లీటర్ల ఇంధనాన్ని, తద్వారా రూ.6.05 కోట్లు ఆదా చేసినట్లు రమణరావు పేర్కొన్నారు. -
విన్నపాలు వినవలె..
సర్కారుకు శాఖల ‘బడ్జెట్’ విజ్ఞప్తులు ♦ వెయ్యి కోట్లిచ్చి ఆదుకోండి: ఆర్టీసీ ♦‘డబుల్’కు రూ.20 వేల కోట్లు: గృహ నిర్మాణ శాఖ ♦ రూ.3,800 కోట్లు కావాలి: బీసీ సంక్షేమ శాఖ సాక్షి, హైదరాబాద్: తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆర్టీసీ ఆర్థిక సాయం కోసం ప్రభుత్వం వైపు ఆశగా చూస్తోంది. అప్పులు, బకా యిలు, నష్టాల వల్ల జీతాలు చెల్లించేందుకు కూడా ఇబ్బందిగా ఉన్నందున ఈసారి బడ్జెట్లో రూ.1,064 కోట్లిచ్చి ఆదుకోవాలని ఆర్టీసీ ఎండీ రమణారావు కోరారు. ఈ మేరకు రవాణా మంత్రి మహేందర్‌రెడ్డికి ఇటీవల ఆయన ప్రతిపాదనలు అందజేశారు. ప్రభు త్వం చెల్లించాల్సిన రూ.590 కోట్ల బస్సు పాసుల రాయితీ మొత్తం, ప్రభుత్వ పూచీతో తీసుకున్న రుణాల చెల్లింపులకు సంబంధించిన రూ.334.72 కోట్లతో పాటు కొత్త బస్సుల కొనుగోలుకు రూ.140 కోట్లు చెల్లించాలని వాటిలో కోరారు. డబుల్ బెడ్రూమ్లకు రూ.20 వేల కోట్లు రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.20 వేల కోట్లు అవసరమవుతా యని గృహనిర్మాణ శాఖ నిర్ధారించింది. ఇందుకు బడ్జెట్లో రూ.3 వేల కోట్లు కేటాయించాలని, హడ్కో నుంచి రూ.17 వేల కోట్లు రుణం తీసుకో వాల్సి ఉంటుందని అధికారులు ప్రతిపాదించారు. ఇతర విభాగాల ఇళ్లకుమరో రూ.2 వేల కోట్లు కలిపి మొత్తం రూ.5 వేల కోట్లు కోరారు. ఇక, బలహీన వర్గాల కాలనీల్లో ఈసారి భారీగా రామాలయాల నిర్మాణం చేపట్టనున్నందున సర్వశ్రేయో నిధికి రూ.100 కోట్లు కేటాయించాలని దేవాదాయ శాఖ కోరింది. కొత్త జిల్లాల ఆవిర్భావంతో అన్ని జిల్లా కేంద్రాల్లో సొంత భవనాలు సమకూర్చుకోవాల్సి ఉన్నందున రూ.167 కోట్లు కేటాయించాలని రవాణా శాఖ అధికారులు కోరారు. హరితహారానికి ప్రభుత్వ ప్రాధాన్యత నేపథ్యంలో అటవీ, పర్యావరణ శాఖకు రూ.800 కోట్లు, కుల వృత్తులకు ప్రోత్సాహం తదితరాల నిమిత్తం బీసీ సంక్షేమ శాఖకు రూ.3,800 కోట్లు కోరుతూ ఆ శాఖల అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటిని సంబంధిత మంత్రులకు అందజేశారు. -
టీఎస్ఆర్టీసీకి ‘ఇండియా బస్’ అవార్డు
సాక్షి, హైదరాబాద్: ఇంధన పొదుపు, తక్కువ ప్రమాదాలు నమోదు చేసిన సంస్థగా ఇటీవల జాతీయ స్థాయిలో అవార్డులు సొంతం చేసుకున్న తెలంగాణ ఆర్టీసీ ఇండియా బస్ అవార్డును కూడా కైవసం చేసుకుంది. అశోక్ లేలాండ్, అబిబస్లాంటి సంస్థలు ఏర్పాటు చేసిన ఇండియా బస్ అవార్డుల్లో ఉత్తర రోడ్డు రవాణాసంస్థగా జాతీయ స్థాయిలో టీఎస్ఆర్టీసీ నిలిచింది. గోవాలో బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో టీఎస్ ఆర్టీసీ ఎండీ రమణారావు గోవా రవాణాశాఖ మంత్రి సుధీర్ దవాలికర్ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు. దేశవ్యాప్తంగా రవాణా బస్సులను ఉత్తమంగా నిర్వహిస్తూ ప్రయాణికులకు మెరుగైన సేవలందిస్తున్న కేటగిరీకి గాను అన్ని ఆర్టీసీలతోపాటు ప్రైవేటు సంస్థలు కూడా పోటీ పడ్డాయి. నామినేషన్లను పరిశీలించిన కమిటీ తుదకు తెలంగాణ ఆర్టీసీని ఎంపిక చేసింది.