సాక్షి, నిజామాబాద్‌నాగారం(నిజామాబాద్‌అర్బన్): అసలే నష్టాల్లో ఉన్న ఆర్టీసీని చక్కదిద్దడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా నిజామాబాద్ రీజీయన్ పరిస్థితి మరీ దారుణంగా తయారైందని ఆర్టీసీ ఎండీ జీవీ రమణారావు అన్నారు. లాభాల్లో ఉన్న డీపోలు సైతం ఆదాయం తేలేకపోతున్నామని ఆర్‌ఎమ్, డిపో మేనేజర్లు అందరూ ప్రత్యేకంగా తనీఖీలు చేస్తూ. ఆర్టీసీకీ ఆదాయం తెచ్చే విధంగా ప్రతి ఒక్కరు శ్రమించాల్సిందేనని అన్నారు. సోమవారం నిజామాబాద్ రీజీయన్‌కు సమీక్ష నిమిత్తం ఏడాది తర్వాతా జిల్లాకు వచ్చారు. ఆర్‌ఎమ్ కాన్ఫరెన్సుహాల్‌లో మధ్యాహ్నాం 12గంటల నుంచి రాత్రి 8గంటల వరకు ఎండీ సుదీర్ఘంగా సమీక్షించారు.
ఈ సందర్బంగా ఎండీ మాట్లాడుతూ గతంలో నిజామాబాద్ రీజీయన్‌కు చాలా పేరుండేదని ఆదాయ వనరుల కేంద్రంగా ఉన్న జిల్లాలో ఆర్టీసీకీ సైతం పెద్దగా నష్టాలు రాలేదన్నారు. నిజామాబాద్ డిపో–1, డిపో–2లు రాష్ట్రంలోనే లాభాల్లో పోటీ పడేవన్నారు. కానీ గత ఏడాది నుంచి రెండు డిపోల పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. లాభాలు చాలా తగ్గాయన్నారు. ఇదీ ఇలాగే కొనసాగితే నష్టాల్లోకి వెళ్తామన్నారు. ఎట్టి పరిస్థితిలో లాభాలు తగ్గకుండా ప్రతి రోజు, ప్రతి నెల లాభాలు పెరుగుతు రావాల్సిందే అన్నారు. డిపో మేనేజర్లు మరింత బాధ్యతతో శ్రమించాలి అనిఅన్నారు.
బాన్సువాడ, బోధన్ డిపోలపై సీరియస్
నిజామాబాద్ రీజియన్‌లోని బాన్సువాడ, బోధన్ డిపోలు అత్యంత దారుణంగా ఉన్నాయన్నారు. నష్టాలు ఎక్కువ మొత్తంలో రావడంపై సీరియస్ అయ్యారు. డిపో మేనేజర్లు, సిబ్బంది సమన్వయం లేకనే భారీ నష్టాలు వస్తున్నాయన్నారు. డిపో మేనేజర్లు బాధ్యతయుతంగా విధులు నిర్వహిస్తే ఇలాంటి పరిస్థితి వచ్చేదికాదన్నారు. రీజీయన్‌లోనే ఈ రెండు డిపోలు నష్టాలు మూటగట్టుకున్నాయన్నారు. నష్టాలు తగ్గడానికి ప్రత్యామ్నయా చర్యలు చేపట్టకపోవడంపై ఎండీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఆర్మూర్, కామారెడ్డి డిపోలు సైతం నష్టాలు పరిస్థితి మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. నష్టాలు తగ్గుతూ లాభాల్లోకి రావాల్సిందే అన్నారు.
అంతర్రాష్ట్ర సర్వీసులు ప్రారంభిస్తాం
ఆర్టీసీ బస్టాండ్ నుంచి త్వరలోనే ముంబాయికి బస్సులు నడిపేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రైవేట్ వాహనాలు ఎంత పోతున్నాయో, వాటికి సంబంధించి లెక్కలు అన్ని చూసుకోని బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రయాణీకులు ఆదరిస్తే ఖచ్చితంగా నడిపితీరుతామన్నారు. ఇప్పటికే అంతరాష్ట్ర సర్వీసులు ప్రారంభించామన్నారు. ఆర్టీసీకి వచ్చే ఆదాయన్ని ఎట్టి పరిస్థితులో వదులుకోమన్నారు.
ఒక్కరు రెండు విధులు చేయాల్సిందే
ఆర్టీసీలో పరిస్థితులు మార్పులు జరుగుతునే ఉన్నాయన్నారు. మార్పులకు అనుగుణంగా మారాల్సిందే అన్నారు. గతంలో టిమ్ మిషన్‌లు తీసుకరావడం జరిగిదని, ఇప్పుడు డ్రైవరే టిమ్స్ ద్వారా కండక్టర్ పనులు చేస్తు డ్రైవింగ్ చేస్తున్నారన్నారు. ఇంద్ర, డీలక్స్ బస్సుల్లో ఇదే నడుస్తుందని, వజ్రబస్సుల్లో, అదే విధంగా ఇప్పుడు జిల్లాలో అక్కడక్కడ నడుపుతున్న నాన్‌స్టాప్ బస్సుల్లో సైతం డ్రైవర్‌చేత రెండు పనులు చేయిస్తున్నామని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే డ్రైవర్ రెండు పనులు చేస్తున్నారని, మన దగ్గర కూడా అదే పరిస్థితి ఉంటుందన్నారు.
4వేల మంది కార్మికులను రెగ్యులర్ చేశాం
ఆర్టీసీలో ఒకేసారీ 4వేల మంది కార్మికులను రాష్ట్రం వచ్చిన తర్వాతా రెగ్యులర్ చేశామన్నారు. దీంతో కారుణ్య నియమకాలు భర్తి చేయడం జరిగిందని, కార్మికులు ఇప్పటీకే ఎక్కువగా ఉన్నారన్నారు. అందుకే రిక్రూట్‌మెంట్ చేయడం లేదన్నారు. ప్రతి బస్టాండ్‌లల్లో సీసీ కెమోరాలు ఏర్పాటు చేయటానికి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రయాణీకుల భదత్రే మా లక్ష్యం అన్నారు. ఆర్టీసీ బస్టాండ్, డిపోల ఖాళీ ప్రదేశాల్లో పెట్రోల్ బంకులు ఏర్పాటు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అధికారులు, కార్మికులు అందరూ కలిసి కట్టుగా శ్రమించాల్సిందే అన్నారు. సమిష్టి కృషితో ఆర్టీసీ వృద్ధిలోకి వస్తుందన్నారు. సమీక్షలో ఆర్‌ఎమ్ కె.ఎస్.ఖాన్, డీవీఎం గణపతిరావు, పీఓ శ్రీనివాస్, డిపోల మేనేజర్లు ఆనంద్, సాయన్న, ఇతర అధికారులు
తదితరులు పాల్గొన్నారు.
ఎండీని కలిసిన వివిధ సంఘాల నాయకులు
ఆర్టీసీ ఎండీ జీవీ రమణారావు జిల్లాకు రావడంతో వివిధ సంఘాల నాయకులు ప్రత్యేకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించారు. అనంతరం వినతిపత్రాలు సమర్పించారు. ఇందులో టీఎమ్‌యూ నుంచి మురళి, శ్రీనివాస్, మాక్లూర్ శేఖర్, ఎన్‌ఎమ్‌యు నుంచి ఎన్‌ఎ కుమార్, ఈయు నుంచి సాయిలు, సాయిప్రసాద్, అబ్బయ్య, బిసి సంఘం నుంచి శ్రీనివాస్, బికేయు నుంచి పరుశురాం, ఎస్‌డబ్లు్యఎఫ్ నుంచి సంజీవ్‌లు కలిసి సమస్యలపై విన్నవించారు.
Comments
Please login to add a commentAdd a comment