మాట్లాడుతున్న ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి రామక్రిష్ణ
సాక్షి, కల్లూరు : గని, శకునాల గ్రామాలకు చెందిన సోలార్ బాధిత కుటుంబాలకు పునరావాసం కల్పించాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి. రామక్రిష్ణ డిమాండ్ చేశారు. సోమవారం శకునాలలో సోలార్ బాధిత కుటుంబాలతో ఏపీ రైతు సంఘం నాయకులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రామక్రిష్ణ మాట్లాడుతూ సోలార్ పరిశ్రమ స్థాపనకు సేకరించిన భూములపై ఆధారపడి జీవిస్తున్న రైతు కూలీలకు పునరావాసం కల్పించాలని కోర్టు ఆదేశించిందన్నారు.
2013 భూ సేకరణ చట్టం ప్రకారం కూడా బాధితులకు అవార్డు పాస్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు. అయితే, అధికారుల ఒత్తిడితో గని, శకునాల గ్రామాల్లో ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో నిద్రిస్తున్న వారి నుంచి సంతకాల సేకరణ చేయించడం ఎంతవరకు సమంజసమన్నారు. బాధితులకు అందించే పునరావాసం ఎగ్గొంటేందుకే ఉన్నతాధికారులు పనిచేయడం సిగ్గుచేటన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో బాధితులు చాంద్‌బాషా, శ్రీధర్, శేఖర్, రాముడు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment