
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా సోలార్ విద్యుదుత్పత్తి సంస్థల్లో అదానీ గ్రూపు స్థానం సంపాదించుకుంది. ప్రపంచంలో యుటిలిటీ సోలార్ పవర్ ప్రాజెక్టుల అభివృద్ధి పరంగా టాప్–15 జాబితాలో చేరిన అదానీ గ్రూపు 12వ స్థానం దక్కించుకుంది. గ్రీన్‌టెక్ మీడియా రూపొందించిన ఈ జాబితాలో ఉన్న ఏకైన భారతీయ కంపెనీ అదానీ ఒక్కటే.
గ్రీన్‌టెక్ మీడియా రూపొందించిన జాబితాలో ఫస్ట్ సోలార్ కంపెనీ మొదటి స్థానంలో నిలిచింది. ఈ కంపెనీ 4,619 మెగావాట్ల సోలార్ విద్యుదుత్పాదన చేస్తుండగా, దీనికి అదనంగా 4,802 మెగావాట్ల సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తోంది. అదానీ గ్రూపు 788 మెగావాట్ల సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోంది.