
సాక్షి, న్యూఢిల్లీ: పీఎన్‌బీ స్కాంలో కీలక నిందితుడు నీరవ్‌మోదీకి ఈడీ మరోషాక్ ఇచ్చింది. అహ్మద్‌నగర్‌లోని సోలార్ ప్లాంట్‌ను, వందల ఎకరాల భూమిని తాజాగా ఈడీ సీజ్ చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) కుంభకోణానికి సంబంధించి నీరవ్ కు చెందిన సౌర విద్యుత్ ప్లాంట్, 134 ఎకరాల భూమిని ధృవీకృత ఆస్తులుగా స్వాధీనం చేసుకుంది. ఈ మెగా స్కాంలో ఇప్పటికే మోదీకి చెందిన 21 రకాల స్థిరాస్తులను ఈడీ ఎటాచ్ చేసింది. వీటి విలువ దాదాపు రూ.523 కోట్లు. కాగా అహ్మద్‌నగర్ జిల్లా కర్జత్‌లోగల 134 ఎకరాల స్థలం ఉండగా, 53 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సౌర విద్యుత్ ప్లాంట్ విలువ రూ.70 కోట్లుగా ఉన్నట్టు ఈడీ తెలిపింది.
కాగా వేలకోట్ల రూపాయల బ్యాంకులకు ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన కేసులో డైమండ్‌వ్యాపారి నీరవ్‌మోదీ, ఆయన మామ, గీతాంజలి జెమ్స్ ఎండీ మెహల్ చోక్సి తదితులపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. అలాగే విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖ వీరి పాస్‌పోర్టులను రద్దుచేసింది.