అభివృద్ధి చెందిన భారత్ (వికసిత భారత్) మన లక్ష్యం అంటూ ప్రధాన చెబుతూనే ఉన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే టెక్నాలజీని మరింత విస్తరించాలని.. పునరుత్పాదక వనరులను ఉపయోగించుకోవాలని కేంద్రమంత్రులు సైతం అనేక సమావేశాలలో పేర్కొంటున్నారు. ఈ తరుణంలో ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ ఖాతాలో ఓ వీడియో షేర్ చేశారు.
ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో సోలార్ ఎనర్జీ ఉత్పత్తికి జరుగుతున్న పనులు చూడవచ్చు. ఇందులో ఎక్కడ చూసినా సోలార్ ప్యానెల్స్ వంటి పరికరాలను అమర్చుతూ ఉండటం చూడవచ్చు. ఈ వీడియో షేర్ చేస్తూ.. సౌర శక్తి పరిశ్రమలో ఆవిష్కరణల వేగం కేవలం నమ్మశక్యం కాదు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తున్నప్పుడు.. మన అవసరాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం ప్రతి విషయంలోనూ కొత్త టెక్నాలజీలను ఆన్చేసించాల్సి ఉంటుందని ట్వీట్ చేశారు.
ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ వీడియో అతి తక్కువ సమయంలోనే తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో సోలార్ ఎనర్జీ చాలా అవసరమని చాలామంది తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.
The pace of innovation in the solar energy industry is simply incredible.
As the fastest growing large economy in the world, our energy needs are going to be daunting…
So we need to explore not one, but each and EVERY one of these new technologies…. pic.twitter.com/kcG6YVLYL2— anand mahindra (@anandmahindra) August 21, 2024
Comments
Please login to add a commentAdd a comment