ఆ నగరం భారతదేశ బాహుబలి: ఆనంద్ మహీంద్రా | Anand Mahindra Shares A Video Hailing Morbi City In Gujarat For Its Booming Ceramic Production | Sakshi
Sakshi News home page

ఆ నగరం భారతదేశ బాహుబలి: ఆనంద్ మహీంద్రా

Published Sat, Mar 8 2025 3:47 PM | Last Updated on Sat, Mar 8 2025 4:08 PM

Anand Mahindra Shares A Video Hailing Morbi City In Gujarat For Its Booming Ceramic Production

ప్రముఖ పారిశ్రామికవేత్త 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra).. ఆసక్తికరమైన విషయాలను ఎప్పటికప్పుడు తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే తాజాగా గుజరాత్‌లోని ఓ చిన్న పట్టణానికి చెందిన వీడియో షేర్ చేశారు. ఇది నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

మహీంద్రా & మహీంద్రా చైర్మన్ షేర్ చేసిన వీడియోలో.. గుజరాత్‌లోని మోర్బి, సిరామిక్ పరిశ్రమలో దాని ఆధిపత్యాన్ని వెల్లడించడం చూడవచ్చు. కేవలం 9 కి.మీ. విస్తీర్ణంలో ఉన్న మోర్బి పట్టణం భారతదేశ సిరామిక్ ఉత్పత్తిలో 90% వాటాను కలిగి.. ప్రపంచ సిరామిక్ హబ్‌గా ఎలా అభివృద్ధి చెందిందో ఈ వీడియోలో చూడవచ్చు. 1930 నుంచి దాదాపు 1,000 కుటుంబాల యాజమాన్యంలో ఈ పరిశ్రమ వృద్ధి చెందింది.

నాణ్యతలో ఏ మాత్రం తీసిపోకుండా.. తక్కువ ధరలోన సిరామిక్ వస్తువులు లభిస్తున్నాయి. ప్రపంచంలోని మొత్తం సిరామిక్ ఉత్పత్తిలో మోర్బి గణనీయమైన వాటాను కలిగి ఉంది. మోర్బి వ్యవస్థాపకులను ప్రశంసిస్తూ.. భారతీయ వ్యాపారాలు చైనాతో పోటీ పడగలవా? బహుశా మనం విజయగాథల కోసం సరైన ప్రదేశాల కోసం వెతకడం లేదు. 'మోర్బి' ప్రభావానికి సంబంధించిన ఈ వీడియో చూసి నేను సంతోషించాను. ఇది చిన్న పట్టణమే అయినప్పటికీ.. భారతదేశ 'బాహుబలి' అని ఆనంద్ మహీంద్రా అన్నారు.

మోర్బి సిరామిక్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లు
ప్రపంచవ్యాప్తంగా విజయం సాధించినప్పటికీ.. మోర్బి సిరామిక్ పరిశ్రమ దేశీయ, అంతర్జాతీయ డిమాండ్ తగ్గడంతో ఇబ్బంది పడుతోంది. గ్యాస్ వినియోగంపై పన్నులను తగ్గించాలని, వ్యాట్ నుంచి GSTకి మారాలని.. ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ ప్రయోజనాల వంటివి కావాలని ప్రభుత్వాన్ని తయారీదారులు కోరుతున్నారు. ఈ పరిశ్రమ రోజుకు దాదాపు మూడు మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్‌ను వినియోగిస్తుంది. తయారీదారులు దీనికే ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది.

ఇదీ చదవండి: శివ్ నాడార్ కీలక నిర్ణయం: కుమార్తెకు భారీ గిఫ్ట్

సౌదీ అరేబియా, ఖతార్, తైవాన్ వంటి దేశాలు 50% నుంచి 106% వరకు యాంటీ డంపింగ్ సుంకాలు విధించడం వల్ల ఎగుమతులు కూడా దెబ్బతిన్నాయి. అంతే కాకుండా.. ఇరాన్‌పై వాణిజ్య ఆంక్షలు కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, అజర్‌బైజాన్‌లకు ఎగుమతి మార్గాలను దెబ్బతీశాయి. దీని వలన తయారీదారులు ఖరీదైన ప్రత్యామ్నాయ షిప్పింగ్ మార్గాలను ఎంచుకోవలసి వచ్చింది. ఇన్ని సవాళ్ళను ఎదుర్కొంటూనే.. మోర్బి ప్రపంచ సిరామిక్ నాయకుడిగా భారతదేశం ఖ్యాతిని నలుదిశల వ్యాపింపజేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement