
డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేయడం గురించి అందరికీ తెలుసు. ముందుగా ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లి.. వ్యాలిడిటీ ముగిసిన డ్రైవింగ్ లైసెన్స్ జిరాక్స్ ఇవ్వాల్సి, రెన్యువల్ కోసం ఫామ్ 9 ఫిల్ చేయాలి. మెడికల్ సర్టిఫికెట్, ఐడెంటిటీ ప్రూఫ్, రెసిడెన్సీ ప్రూఫ్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు వంటివి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
అవసరమైన డాక్యుమెంట్స్ అందించిన తరువాత.. బయోమెట్రిక్, ఫీజు చెల్లింపులు వంటివి చేయాలి. ఇలా అన్నీ పూర్తి చేసిన తరువాత మీ చేతికి రెన్యూవల్ డ్రైవింగ్ లైసెన్స్ అందటానికి కనీసం 15 నుంచి 30 రోజుల సమయం పడుతుంది. అయితే దుబాయ్‌లో కేవలం రెండే నిమిషాల్లో రెన్యువల్ డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.
వీడియోలో గమనించినట్లయితే.. ఒక మహిళ ఆర్టీఏ స్మార్ట్ కియోస్క్ ద్వారా రెన్యువల్ డ్రైవింగ్ లైసెన్స్ కార్డును పొందటం చూడవచ్చు. మహిళ మెషీన్ దగ్గరకు వెళ్లి డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవడానికి అవసరమైన ఆప్షన్స్ ఎంచుకుని.. కేవలం నిమిషాల్లో డ్రైవింగ్ లైసెన్స్ కార్డును పొందుతుంది. ఇది చూడటానికి ఓ ఏటీఎం మెషీన్స్ మాదిరిగా ఉంటుంది. ఇలాంటి మెషీన్స్ దుబాయ్‌లో అక్కడక్కడా కనిపిస్తాయి.
ఇదీ చదవండి: బ్రిటన్ వీడనున్న స్టీల్ టైకూన్ లక్ష్మీ మిత్తల్?: కారణం ఇదే..
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు తమకు తోచిన విధంగా కామెంట్స్ చేస్తూ.. ఇలాంటిది మనదేశంలో కూడా ఉండుంటే బాగుంటుందని అంటున్నారు. రెన్యువల్ డ్రైవింగ్ లైసెన్స్ కోడం వేచి చూడాల్సిన అవసరం లేకుండా ఇవి ఉపయోగపడతాయని చెబుతున్నారు.
Compare this to the process of renewal of driving licence in India. pic.twitter.com/Xs2eXygI99
— Tushar (@Tusharufo2) March 27, 2025