పీఎం సోలార్ రూఫ్‌టాప్ స్కీమ్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 1.3 కోట్లకు పైగా కుటుంబాలు ఈ పథకం కోసం నమోదు చేసుకున్నాయని ప్రధాన మంత్రి 'నరేంద్ర మోదీ' సోమవారం తెలిపారు. గుజరాత్‌లోని గాంధీనగర్ జిల్లాలో జరిగిన 4వ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ (రీ-ఇన్వెస్ట్) 2024 ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోదీ ఈ ప్రకటన చేశారు.
సోలార్ రూఫ్‌టాప్ పథకం ప్రారంభించినప్పటి నుంచి.. సుమారు 3.75 లక్షల ఇళ్లలో ఇన్‌స్టాలేషన్ పనులు పూర్తయ్యాయని మోదీ వెల్లడించారు. ఈ స్కీమ్ ద్వారా వినియోగదారులు తమ వినియోగానికి కావలసిన విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవడమే కాకుండా.. అదనపు విద్యుత్‌ను గ్రిడ్‌కు విక్రయించడం ద్వారా ఏడాదికి రూ. 25000 ఆదాయం పొందుతున్నారు.
ఇదీ చదవండి: రూ. 75వేలు దాటేసిన బంగారం.. రూ. లక్షకు చేరువలో వెండి
ఒక చిన్న కుటుంబం నెలకు 250 యూనిట్ల విద్యుత్ ఉపయోగించుకున్న తరువాత.. కూడా కొంత ఆదాయాన్ని పొందటం అనేది చాలా గొప్ప విషయం. ఈ పథకం ద్వారా ఉపాధి కల్పన కూడా ఏర్పడుతుందని పేర్కొంటూ.. గ్రీన్ ఉద్యోగాలు వేగంగా పెరుగుతాయని అన్నారు. ఈ పథకం ద్వారా దాదాపు 20 లక్షల ఉద్యోగావకాశాలు లభిస్తాయని మోదీ వెల్లడించారు. పీఎం సోలార్ రూఫ్‌టాప్ పథకం ద్వారా భారతదేశంలోని పొరతి ఇల్లు విద్యుత్ ఉత్పత్తిదారుగా మారుతుందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment