ఆలియాభట్‌ చొరవతో వెలుగులు | Alia Bhatt initiative lights up 40 homes in Mandya Karnataka | Sakshi
Sakshi News home page

ఆలియాభట్‌ చొరవతో వెలుగులు

Jul 16 2018 8:50 AM | Updated on Oct 22 2018 8:26 PM

Alia Bhatt initiative lights up 40 homes in Mandya Karnataka - Sakshi

మండ్య: బాలీవుడ్‌ యువ హీరోయిన్‌ ఆలియా భట్‌ మండ్య జిల్లాలోని కిక్కేరి గ్రామప్రజల ఇళ్లల్లో విద్యుత్‌ కాంతులు వెలగడానికి కారణమయ్యారు. బెంగళూరులోని ఒక సంస్థ ప్లాస్టిక్‌ బాటిళ్లను రీసైక్లింగ్‌ చేసి తయారు చేసిన కొత్త బాటిళ్లను విక్రయించడం ద్వారా వచ్చే డబ్బుతో విద్యుత్‌ సౌకర్యం లేని పేదలకు ఉచితంగా సోలార్‌ విద్యుత్‌ ఉపకరణాలను అందిస్తోంది. ఈ క్రమంలో పేదల ఇళ్లల్లో విద్యుత్‌ కాంతులు వెలిగించే కార్యానికి సహకరించాలంటూ సంస్థ ప్రతినిధులు ఆలియాభట్‌ను కోరారు. అందుకు సానుకూలంగా స్పందించిన ఆలియాభట్‌ కొద్ది రోజుల క్రితం తమ దుస్తులు వేలం వేయడం ద్వారా వచ్చిన నిధులను సంస్థకు అందించింది. అలియా అందించిన నిధులతో సంస్థ ప్రతినిధులు మండ్య జిల్లా కిక్కెరి గ్రామంలో 40 మంది పేదలకు ఉచితంగా సోలార్‌ విద్యుత్‌ ఉపకరణాలు అందించారు.

1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement