
కళ్లజోడుతో విద్యుత్
కళ్లజోడు నుంచి విద్యుత్ ఏంటి అనుకుంటున్నారా..? నిజమేనండీ.. సోలార్ గాగుల్స్ అనే కొత్తరకం కళ్ల జోడును శాస్త్రవేత్తలు అభివృద్ధి పరిచారు. ఇవి సూర్యరశ్మిని విద్యుత్‌గా మారుస్తాయి.
కళ్లజోడు నుంచి విద్యుత్ ఏంటి అనుకుంటున్నారా..? నిజమేనండీ.. సోలార్ గాగుల్స్ అనే కొత్తరకం కళ్ల జోడును శాస్త్రవేత్తలు అభివృద్ధి పరిచారు. ఇవి సూర్యరశ్మిని విద్యుత్‌గా మారుస్తాయి. ఫ్రేమ్‌లో ఉండే సర్క్యూటరీ ద్వారా బ్యాటరీల్లో నిల్వ కూడా చేసుకోవచ్చు. సిలికాన్‌ను ఉపయోగించకుండా.. కేవలం సేంద్రియ పదార్థాలతో తయారైన సోలార్ ప్యానెల్స్‌ను ఇందులో వాడటం విశేషం.
జర్మనీకి చెందిన కార్ల్‌హ్రూసర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు తయారు చేసిన ఈ పారదర్శక సోలార్ ప్యానెళ్లను కళ్లజోడులో వాడటం పెద్ద విశేషమేమీ కాదుగానీ.. ఈ రకమైన ప్యానెల్స్‌ను భవిష్యత్తులో మన కిటికిల్లో, భవనాల ముందువైపు పానెళ్లలో వాడితే ఎక్కడికక్కడ కాలుష్యం లేని విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకునేందుకు వీలు కలుగుతుంది. ఈ కళ్లజోడులోని సోలార్ ప్యానెల్స్ తో ఎంత విద్యుత్తు ఉత్పత్తి అవుతుందో తెలుసా? దాదాపు 200 మిల్లీ వాట్లు. బధిర యంత్రాలు, కొన్ని రకాల ఫిట్‌నెస్ ట్రాకర్లకు ఈ విద్యుత్ సరిపోతుంది!