ఎప్పటికప్పుడు నిందలు, అబద్ధాలు, దుష్ప్రచారాలు, టాపిక్ డైవర్షన్‌లు
ఎల్లో మీడియా తప్పుడు రాతలు.. చంద్రబాబు మాటలు
రాష్ట్ర అప్పులపై అడ్డగోలుగా అబద్ధాలు
అప్పులు రూ.6.46 లక్షల కోట్లేనని అసెంబ్లీ సాక్షిగా వెల్లడి.. సభలో పెట్టిన కాగ్ నివేదికలోనూ అదే ఉంది
ఆ మరుసటి రోజే రాష్ట్ర అప్పులు రూ.10 లక్షల కోట్లు, రూ.11 లక్షల కోట్లు, రూ.14 లక్షల కోట్లని అబద్ధాలు
వారు బడ్జెట్‌లో చెప్పింది తప్పు అయితే సభలో ఎలా పెట్టారు?
తిరుమల లడ్డూపైనా దుష్ప్రచారం
ఆ నెయ్యి వాడనే లేదని టీటీడీ ఈవో స్వయంగా చెప్పినా అవే అబద్ధాలు
విజయవాడ వరదల విషయంలోనూ విషం చిమ్మారు.. అసలు నగరంలోకి వరదను మళ్లించి.. ఇళ్లను ముంచిందే వాళ్లు
ఎన్నికలకు ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై నానా యాగీ
అది మంచిది కాకపోతే రీ సర్వేను ఎందుకు కొనసాగిస్తామంటున్నారు?
సౌర విద్యుత్ కొనుగోలుపై వారం రోజులుగా దుర్మార్గంగా ‘ఈనాడు’ నిందలు
సెకీ ఒప్పందంపై విష ప్రచారం
అంతర్ రాష్ట్ర ప్రసార చార్జీలు ఉండవన్న కేంద్ర విద్యుత్ శాఖ, సెకీ
‘సెకీ’, రాష్ట్ర ప్రభుత్వం, డిస్కంలు, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ మధ్య ఒప్పందంలోనూ స్పష్టత.. కళ్లెదుటే వాస్తవాలున్నా నిత్యం అబద్ధాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సౌర విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి కక్షపూరితంగా వ్యవహరిస్తూ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేరును ఇందులోకి లాగి.. చంద్రబాబు, ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారం అబద్ధమని తేలిపోయింది. ఈనాడు నిస్సిగ్గుగా, నిర్లజ్జగా వండి వారుస్తున్న తప్పుడు కథనాలు దురుద్దేశ పూరితమని స్పష్టమైంది. జరగనిది జరిగినట్లు.. లేనిది ఉన్నట్లు అందంగా అసత్యాలను అచ్చేస్తున్నారని తేటతెల్లమైంది. విద్యుత్ కొనుగోలు విషయంలో ఈనాడు దుష్ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది.
కళ్ల ముందు స్పష్టంగా సెకీ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖ, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కనిపిస్తున్నా.. అన్నింటినీ వదిలేసి కేవలం దుర్బుద్ధితో అప్పటికప్పుడు అబద్ధాన్ని సృష్టించడం.. దానిపై విష ప్రచారం చేయడం అనే విద్యను ఈనాడు నిర్లజ్జగా ప్రదర్శిస్తోంది. ఎన్నికలకు ముందు, ఆ తర్వాత కూడా ఇలాగే విషం చిమ్ముతోంది. రాష్ట్ర అప్పులపై కూడా అడ్డగోలుగా అబద్ధాలు చెబుతున్నారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి అప్పులు రూ.6.46 లక్షల కోట్లేనని ముఖ్యమంత్రి చంద్రబాబే అసెంబ్లీ సాక్షిగా స్వయంగా ఒప్పుకున్నారు. సభలో పెట్టిన కాగ్ నివేదికలోనూ అదే ఉంది. మళ్లీ బయటకు వచ్చి వారు రాష్ట్ర అప్పు రూ.10 లక్షల కోట్లు, రూ.11 లక్షల కోట్లు, రూ.14 లక్షల కోట్లు అని మాట్లాడుతున్నారు. ఈనాడు నిస్సిగ్గుగా అలాగే తప్పుడు కథనాలు వండివారుస్తోంది.
వారు బడ్జెట్‌లో చెప్పింది తప్పు అయితే సభలో ఎలా పెట్టారు? అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పరు. తిరుమల లడ్డూ విషయంలో కూడా ఇలాగే దుష్ప్రచారం చేశారు. అసలు ఆ నెయ్యిని వాడనే లేదని, ఆ ట్యాంకర్లను తిరుమలకు అనుమతించనే లేదని సాక్షాత్తు టీటీడీ ఈవోనే చెప్పారు. తిరుపతి నుంచే వెనక్కు పంపామని మీడియా సమక్షంలో స్పష్టం చేశారు. అయినా కల్తీ నెయ్యి వాడారంటూ అబద్ధాలు చెబుతూ విషం చిమ్మారు.
తిరుమలలో ప్రసాదాల తయారీకి సంబంధించి దశాబ్దాలుగా స్పష్టమైన ప్రొసీజర్ ఉన్నప్పటికీ, క్రమం తప్పకుండా వాటిని పాటిస్తున్నప్పటీకీ దుర్మార్గంగా అబద్ధాలు చెప్పారు. మొన్న విజయవాడ వరదల విషయంలోనూ అదే పాట పాడారు. అసలు నగరంలోకి వరదను మళ్లించిందే వారు కదా! ఎన్నికలకు ముందు ఇదే ఈనాడు, ఇదే దుష్టచతుష్టయం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై చేసిన యాగీ, దుష్ప్రచారం అంతా ఇంతా కాదు.
ఇంతా చేసి ఇప్పుడు రీసర్వేను కొనసాగిస్తామని చెబుతున్నారంటే అర్థమేంటి? ఆ యాక్ట్ మంచిదనే కదా! ఇదేంటని అడిగితే వెంటనే మాట మార్చేస్తారు. లేదా టాపిక్ డైవర్ట్ చేస్తారు. చౌకగా సౌర విద్యుత్ కొనుగోలు విషయంలోనూ ఇదే ఈనాడు, ఇదే చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఆత్మనిర్బర్ భారత్ కింద రాష్ట్రానికి మంజూరైన ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్ట్‌కు ఇన్సెంటివ్ ఉంది. లేఖలో కూడా ఆ విషయం స్పష్టంగా ఉంది. అయినా కూడా పచ్చిగా అబద్ధాలు చెబుతున్నారు.
కళ్లెదుటే ఎన్నో సాక్ష్యాలు
సౌర విద్యుత్ కొనుగోలుకు తమతో ఒప్పందం చేసుకుంటే కేంద్ర విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రోత్సాహకంగా అంతర్ రాష్ట్ర ప్రసార చార్జీ(ఐఎస్‌టీఎస్)ల నుంచి మినహాయింపు వస్తుందని సెకీ చెప్పినా ఎల్లో మీడియాకు కనపడదు. సెకీతో కుదుర్చుకునే పునరుత్పాదక విద్యుత్ ఒప్పందాలకు అంతర్ రాష్ట్ర ప్రసార చార్జీలు ఉండవని కేంద్ర విద్యుత్ శాఖ ఆదేశాల్చినా వారికి పట్టదు.
సెకీ ఒప్పందాలకు పాతికేళ్ల పాటు విద్యుత్ ప్రసార చార్జీలు ఉండవని కేంద్రం విద్యుత్ నియంత్రణ మండలి(సీఈఆర్‌సీ) స్పష్టం చేసినా వారి చెవికెక్కదు. చివరికి సెకీ, రాష్ట్ర ప్రభుత్వం, డిస్కంల మధ్య జరిగిన విద్యుత్ సరఫరా ఒప్పందంలోనూ ఐఎస్‌టీఎస్ చార్జీలు వంద శాతం మాఫీ అని స్పష్టంగా ఉన్నా పట్టించుకోరు.
కేవలం గత ప్రభుత్వంపై బుదర జల్లాలి.. జగన్‌పై నిందలు వేయాలి.. ఒప్పందంపై విషం గక్కాలి.. ఇదే అజెండాగా కొద్ది రోజులుగా టీడీపీ, దాని అనుబంధ మీడియా తప్పుడు ప్రచారం చేస్తూనే ఉంది. అర్థం లేని ఆరోపణలు చేస్తూ ప్రజలను గందరగోళానికి గురిచేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. కానీ వందసార్లు వారంతా వాదించినంత మాత్రాన అబద్ధం నిజమైపోదు. ‘సెకీ’ ఒప్పందం నేపథ్యంలో నమోదైన ఏ వాస్తవం కూడా మారిపోదు.
తీరు మార్చుకోని ఎల్లో మీడియా
సెకీ ఒప్పందానికి ఐఎస్‌టీఎస్ చార్జీలు వర్తించవంటూ కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రభుత్వం, సీఈఆర్‌సీ, సెకీతో జరిగిన ఒప్పందంలోనూ ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ టీడీపీ, దాని అనుబంధ మీడియా అసత్యాలను ప్రచారం చేస్తూనే ఉన్నాయి. ఐఎస్‌టీఎస్ ఛార్జీల భారాన్ని రాష్ట్రం భరించాల్సి వస్తుందంటూ మళ్లీ అదే అబద్ధాన్ని పదే పదే వండి వారుస్తున్నాయి.
సీఈఆర్‌సీ కూడా చెప్పింది
2023 ఫిబ్రవరి 7న సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమీషన్(సీఈఆర్‌సీ) ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. అంతర్ రాష్ట్ర ప్రసార ఛార్జీలు, నష్టాల భాగస్వామ్యం (మొదటి సవరణ) నిబంధనలు 2023 ప్రకారం.. ఉత్పాదక ఉత్పత్తి కేంద్రాల నుంచి వచ్చే విద్యుత్‌కు ఎక్స్‌ప్రెస్ నిబంధనలను అందులో రూపొందించింది. వాటి ప్రకారం సీఓడీతో సంబంధం లేకుండా రెన్యూవబుల్ పవర్ పర్చేజ్ ఆబ్లిగేషన్(ఆర్పీఓ) ఉన్న సంస్థలకు కొంత కాలం పాటు ఐఎస్‌టీఎస్ చార్జీల మినహాయింపు లభిస్తుంది. అది సీఓడీ తేదీ నుంచి 25 సంవత్సరాల పాటు వస్తుందని సీఈఆర్‌సీ స్పష్టం చేసింది.
ప్రతిపాదన లేఖలోనే స్పష్టత
‘సెకీ’తో ఒప్పందం కారణంగా విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లపై ఆర్థిక భారం పడుతుందంటూ మరోసారి ‘ఈనాడు’ పచ్చి అబద్ధాన్ని బుధవారం అచ్చేసింది. ఐఎస్‌టీఎస్ చార్జీలు వర్తించవని ఇప్పటికే అనేకసార్లు నిజాలు వెల్లడించినప్పటికీ దుష్ప్రచారాన్ని కొనసాగిస్తూనే ఉంది. యూనిట్ రూ.2.49 చొప్పున చవక్చ ధరకే సౌర విద్యుత్‌ను అందిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వానికి 2021 సెప్టెంబర్ 15న సెకీ రాసిన లేఖ ద్వారా ప్రతిపాదన చేసింది.
ప్రాజెక్టు వాణిజ్య కార్యకలాపాలు(కమర్షియల్ ఆపరేషన్ డేట్)తో సంబంధం లేకుండా ప్రత్యేక ప్రోత్సాహకంగా ఐఎస్‌టీఎస్ చార్జీల నుంచి కేంద్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిందని ఆ లేఖలో సెకీ స్పష్టంగా పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అలాంటి ఛార్జీలు వర్తించవని లేఖలో వివరంగా చెప్పింది.
కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్లలో స్పష్టం
2021 నవంబర్ 30 నాటి విద్యుత్ మంత్రిత్వ శాఖ 23వ ఆదేశాల్లోని క్లాజ్ 3.3 ప్రకారం.. మాన్యుఫ్యాక్చరింగ్ లింక్డ్ కెపాసిటీ స్కీమ్‌లో భాగంగా సెకీ టెండర్ ద్వారా స్థాపించే సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు ఐఎస్‌టీఎస్ చార్జీలు మాఫీ అవుతాయి. అంతేకాదు సీఓడీతో సంబంధం లేకుండా రెన్యూవబుల్ పవర్ పర్చేజ్ ఆబ్లిగేషన్(ఆర్పీఓ) ఉన్న సంస్థలకు ఈ ప్రయోజనం అందుతుందని కేంద్రం స్పష్టం చేసింది.
2021 నవంబర్ 30న కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్
సీఈఆర్‌సీ కూడా చెప్పింది
2023 ఫిబ్రవరి 7న సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమీషన్(సీఈఆర్‌సీ) ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. అంతర్ రాష్ట్ర ప్రసార ఛార్జీలు, నష్టాల భాగస్వామ్యం (మొదటి సవరణ) నిబంధనలు 2023 ప్రకారం.. ఉత్పాదక ఉత్పత్తి కేంద్రాల నుంచి వచ్చే విద్యుత్‌కు ఎక్స్‌ప్రెస్ నిబంధనలను అందులో రూపొందించింది. వాటి ప్రకారం సీఓడీతో సంబంధం లేకుండా రెన్యూవబుల్ పవర్ పర్చేజ్ ఆబ్లిగేషన్(ఆర్పీఓ) ఉన్న సంస్థలకు కొంత కాలం పాటు ఐఎస్‌టీఎస్ చార్జీల మినహాయింపు లభిస్తుంది. అది సీఓడీ తేదీ నుంచి 25 సంవత్సరాల పాటు వస్తుందని సీఈఆర్‌సీ స్పష్టం చేసింది.
సెకీ ఒప్పందంలోనూ అదే..
ఐఎస్‌టీఎస్ చార్జీల ప్రాధాన్యతను రాష్ట్ర ప్రభుత్వం ముందే గుర్తించింది. అందువల్ల కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెకీ.. రాష్ట్ర ప్రభుత్వం, డిస్కంలు, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ మధ్య జరిగిన విద్యుత్ సరఫరా ఒప్పందం(పవర్ సేల్ అగ్రిమెంట్)లోనూ కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రోత్సాహంగా ఐఎస్‌టీఎస్ చార్జీల నుంచి మినహాయింపు ఇస్తుందనే అంశాన్ని భాగం చేసింది.
సెకీతో జరిగిన విద్యుత్ సరఫరా ఒప్పందంలోనూ ఐఎస్‌టీఎస్ చార్జీలు మాఫీ అవుతాయని పేర్కొన్న భాగం
Comments
Please login to add a commentAdd a comment