నేడే సోలార్‌ మిషన్‌ | NASA Is About to Launch the Fastest Spacecraft in History. Target | Sakshi
Sakshi News home page

నేడే సోలార్‌ మిషన్‌

Published Sat, Aug 11 2018 4:04 AM | Last Updated on Tue, Jun 4 2019 6:31 PM

NASA Is About to Launch the Fastest Spacecraft in History. Target - Sakshi

టాంపా: భగభగ మండే సూర్యుడి ఆవరణం గుట్టువిప్పే తొలి అంతరిక్ష ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. పార్కర్‌ సోలార్‌ ప్రోబ్‌ అనే భారీ వాహక నౌకను నింగిలోకి పంపేందుకు నాసా పూర్తి ఏర్పాట్లు చేసింది. శనివారం వేకువజామున ఫ్లోరిడా అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరగనుంది. ఇందుకు సంబంధించిన కౌంట్‌డౌన్‌ శుక్రవారం ప్రారంభమైంది. సూర్యుడి చుట్టూ ఉండే కరోనా పొర రహస్యాలను ఛేదించడమే ఈ మిషన్‌ ప్రధాన ఉద్దేశమని నాసా ప్రకటించింది. సౌర పవనాల్లో ఏర్పడే అలజడులు భూమిపై ఎప్పుడు, ఎలా ప్రభావం చూపుతాయో అంచనావేయడానికి ఈ ప్రయోగం దోహదపడుతుందని తెలిపింది. సూర్యుడికి సమీపంగా వెళ్లిన తరువాత పార్కర్‌ గంటకు 7 లక్షల కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement